Bhola Shankar : 'భోళాశంక‌ర్' బిగ్ అప్ డేట్ రిలీజ్.. చిరు (Chiranjeevi) బ‌ర్త్ డే ముందే రోజు ఫ్యాన్స్‌కు స‌ర్‌ప్రైజ్

Updated on Aug 21, 2022 01:50 PM IST
చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న భోళాశంక‌ర్ సినిమాను వ‌చ్చే ఏడాదిలో ఏప్రిల్ 14న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. 
చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న భోళాశంక‌ర్ సినిమాను వ‌చ్చే ఏడాదిలో ఏప్రిల్ 14న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. 

Bhola Shankar: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) న‌టిస్తున్న 'భోళాశంక‌ర్' సినిమా నుంచి బిగ్ అప్‌డేట్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 'భోళాశంక‌ర్' సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. చెల్లెలు సెంటిమెంట్‌తో 'భోళాశంక‌ర్' సినిమాను వ‌చ్చే ఏడాది రిలీజ్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 'భోళాశంక‌ర్' విడుద‌ల తేదీతో పాటు చిరంజీవి కొత్త లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

వేస‌విలో సినిమా విడుద‌ల‌

'భోళాశంక‌ర్' సినిమాకు ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వేదాళం' త‌మిళ్ సినిమాను తెలుగులో 'భోళా శంక‌ర్‌'గా రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాలో చిరంజీవి (Chiranjeevi), త‌మ‌న్నా జంట‌గా న‌టిస్తున్నారు.

చిరంజీవి, కీర్తిసురేష్ 'భోళాశంక‌ర్' సినిమాలో అన్నాచెల్లెళ్లుగా న‌టిస్తున్నారు. చిరంజీవికి కీర్తి సురేష్ రాఖీ క‌ట్టే స‌న్నివేశాన్ని మేక‌ర్స్ రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా వీడియో రూపంలో రిలీజ్ చేశారు. 'భోళాశంక‌ర్' సినిమాను వ‌చ్చే ఏడాదిలో ఏప్రిల్ 14న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. 

ఫైట్స్ హైలెట్ కానున్నాయా?

మొద‌టి షెడ్యూల్‌లోనే ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్ భారీ యాక్ష‌న్ సీన్స్ తెర‌కెక్కించార‌ని స‌మాచారం. ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ - ల‌క్ష్మ‌ణ్‌లు క‌లిసి చిరంజీవితో యాక్ష‌న్ సీన్స్ చేయించార‌ట‌. ఫైట్ సీన్స్ కోసం భారీ సెట్స్ కూడా ఏర్పాటు చేశారట‌. 'ఆచార్య' సినిమా ఫ్లాపుతో ఇటు చిరంజీవి.. అటు మెగా ఫ్యాన్స్ డీలా ప‌డ్డారు. ఇక‌పై చిరంజీవి సినిమాలు బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించేలా ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. మెహ‌ర్ ర‌మేష్ కూడా అదే బాట‌లో కొన‌సాగుతున్నారు. 

'భోళాశంక‌ర్' సినిమాలో ముర‌ళీ శ‌ర్మ‌, ర‌ఘుబాబు, రావు ర‌మేష్, ర‌విశంక‌ర్, వెన్నెల కిషోర్, ప్ర‌గ‌తి, తుల‌సి న‌టిస్తున్నారు. ఈ సినిమాకు సాగ‌ర్ మ‌హ‌తి సంగీతం స‌మ‌కూర్చ‌నున్నారు. డూడ్లీ సినిమాటోగ్ర‌ఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Read More: Bhola Shankar : రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన 'భోళాశంక‌ర్' .. చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ వైరల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!