Mahesh Babu : మహేష్ బాబు‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్.. సంబరాలలో ఫ్యాన్స్ !

Updated on Jul 02, 2022 12:37 PM IST
మహేష్ బాబు (Mahesh Babu) గతంలో మహర్షి అనే చిత్రంలో ఓ పెద్ద ఐటీ కంపెనీకి అధినేతగా నటించిన సంగతి తెలిసిందే.
మహేష్ బాబు (Mahesh Babu) గతంలో మహర్షి అనే చిత్రంలో ఓ పెద్ద ఐటీ కంపెనీకి అధినేతగా నటించిన సంగతి తెలిసిందే.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనికులలో ఒకరైన దిగ్గజ వ్యాపారవేత్త బిల్ గేట్స్ (Bill Gates),  తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఒకానొక సూపర్ స్టార్ అయిన మ‌హేశ్ బాబుని (Mahesh Babu) సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారట. కొన్ని వేల కోట్ల ఆస్తులను ఐటీ వ్యాపారం ద్వారా సమకూర్చిన అభినవ కుబేరుడు  బిల్ గేట్స్ తన సంపదలోని అధిక భాగాన్ని ఛారిటీలకే ఖర్చుపెడుతున్నారు.  

బిల్ గేట్స్‌ను కలిసిన మహేష్ బాబు

ఇటీవలే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తన కుటుంబంతో సహా బిల్ గేట్స్‌ను ఆయన ఇంట్లో కలిశారు. ఈ క్రమంలో బిల్ గేట్స్‌తో కొద్ది సేపు మహేష్ బాబు ముచ్చట్లాడారు. పలు విషయాలను కూడా చర్చించారు. ఈ మీట్ జరిగిన పలు రోజుల తర్వాత బిల్ గేట్స్, మహేష్ బాబుని ట్విటర్‌తో పాటు ఇన్‌స్టాగ్రాంలో కూడా అనుసరించడం విశేషం.

మహేష్ బాబుని దిగ్గజ వ్యాపారవేత్త బిల్ గేట్స్ (Bill Gates) సోషల్ మీడియా వేదికలలో ఫాలో అవ్వడంతో.. ఎంబీ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారట. తమ అభిమాన హీరోకి దక్కిన పాపులారిటీని హైలెట్ చేస్తూ సామాజిక మాధ్యమాలలో పోస్టులు కూడా పెడుతున్నారట. 

 

సామాజిక మాధ్యమాలలో వార్త వైరల్

మహేష్ బాబు (Mahesh Babu) గతంలో మహర్షి అనే చిత్రంలో ఓ పెద్ద ఐటీ కంపెనీకి అధినేతగా నటించిన సంగతి తెలిసిందే. భారతదేశానికి వచ్చి మిట్టల్ అనే వ్యాపారవేత్తకు సవాల్ విసిరే యంగ్ అండ్ ఎనర్జిటిక్ సీఈఓగా అందులో మహేష్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు మహేష్‌ను నిజంగానే ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త సామాజిక మాధ్యమాలలో ఫాలో అవ్వడంతో.. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయిందని చెప్పవచ్చు.

మహేష్ ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆఫ్రికన్ అడవులలో సాగే అడ్వంచరస్ జర్నీ అనే కాన్సెప్టుతో ఆ సినిమా తెరకెక్కనుందని వార్తలొస్తున్నాయి. ఇటీవలే మహేష్ బాబు (Mahesh Babu) నటించిన సర్కారు వారి పాట బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనే అనిపించుకుంది. అలాగే మహేష్ నిర్మాతగా తెరకెక్కించిన మేజర్ చిత్రం కూడా ఇండియన్ బాక్సాఫీసు వద్ద కొంత ప్రభావాన్ని చూపించడం విశేషం.

Read More: మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళితో చేసే సినిమా సబ్జెక్టు ఏమిటి? అడివి శేష్ "గూఢచారి"కి ప్రేరణ ఎవరు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!