డాన్స్ షోలో సంద‌డి చేసిన మ‌హేష్ బాబు (Mahesh Babu), సితార‌.. ప్రిన్స్ లుక్ త్రివిక్ర‌మ్ సినిమా కోసమేనా!

Updated on Aug 30, 2022 12:40 PM IST
మహేష్ బాబు (Mahesh Babu) తన కుమార్తె సీతారతో కలిసి జీ తెలుగులో ప్ర‌సార‌మ‌య్యే డాన్స్ ఇండియా  డాన్స్ షోలో  పాల్గొన్నారు.
మహేష్ బాబు (Mahesh Babu) తన కుమార్తె సీతారతో కలిసి జీ తెలుగులో ప్ర‌సార‌మ‌య్యే డాన్స్ ఇండియా  డాన్స్ షోలో  పాల్గొన్నారు.

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెరెక్కుతున్న సినిమా 'ఎస్ఎస్ఎంబి 28'. ఈ సినిమాలో మ‌హేష్ బాబు కొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నారు. మ‌హేష్ బాబు త‌న కూతురు సితార‌తో క‌లిసి ఓ టీవీ షోకు వెళ్లారు. ఆ షోలో మ‌హేష్ లుక్ చూసి సూప‌ర్ అంటున్నారు. మ‌హేష్ బాబు కొత్త లుక్ త్రివిక్ర‌మ్  సినిమా కోస‌మే అయ్యి ఉంటుందంటూ, అభిమానులు భావిస్తున్నారు. 

డాన్స్ అంటే ఓ సెలబ్రేష‌న్ - మ‌హేష్

మహేష్ బాబు (Mahesh Babu) తన కుమార్తె సితారతో కలిసి జీ తెలుగులో ప్ర‌సార‌మ‌య్యే డాన్స్ ఇండియా  డాన్స్ షోలో  పాల్గొన్నారు. డాన్స్ అంటే ఒక సెలబ్రేషన్ అని  మ‌హేష్ తెలిపారు. 'స‌ర్కారు వారి పాట‌'లోని పెన్నీ సాంగ్‌కు సితార స్టెప్పులేసింది. సితార డాన్సు చేస్తున్న‌ప్పుడు మ‌హేష్ బాబు ఎంతో ఆనందించారు. మ‌హేష్ త‌న కూతురు వైపు చూస్తూనే ఉండిపోయారు. డాన్స్ షోకు త‌న కూతురితో క‌లిసి రావ‌డం చాలా ఆనందంగా ఉందని మ‌హేష్ అన్నారు. 

మ‌హేష్ కొత్త లుక్

మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబ‌ర్ 8 నుంచి మొద‌లుకానుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేయ‌నున్నారు. మ‌హేష్ బాబు మొద‌టి సారి మీసాలు, గ‌డ్డంతో క‌నిపించారు. మ‌హేష్ లుక్ చాలా కొత్త‌గా ఉంద‌ని అభిమానులు అంటున్నారు. మాస్ యాక్ష‌న్ సినిమాగా 'ఎస్ఎస్ఎంబి 28' తెర‌కెక్కుతుందా అంటూ మ‌హేష్ లుక్ చూసిన నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 

Read More: Mahesh Babu: "మ‌హేష్ బాబూ.. మ‌నం కూడా మీ నాన్న‌గారి ఐడియాను ఫాలో అవుదామా" : నాగార్జున‌ (Nagarjuna)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!