మ‌హేష్ బాబు (Mahesh Babu) ఫోటో చూసి ఫిదా అవుతున్న‌ ఫ్యాన్స్.. సిమ్మింగ్ చేసే ఫోటోను షేర్ చేసిన న‌మ్ర‌తా

Updated on Aug 20, 2022 06:57 PM IST
మ‌హేష్ (Mahesh Babu) భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ త‌న ఇన్ స్టాలో ఓ ఫోటోను షేర్ చేశారు. మ‌హేష్  ష‌ర్ట్ లేకుండా ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.
మ‌హేష్ (Mahesh Babu) భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ త‌న ఇన్ స్టాలో ఓ ఫోటోను షేర్ చేశారు. మ‌హేష్ ష‌ర్ట్ లేకుండా ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబు (Mahesh Babu) బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌ల‌తో దూసుకెళుతున్నారు. కొత్త క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం అందిస్తారు మ‌హేష్. ప్ర‌స్తుతం మహేష్ బాబు త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టించేందుకు సిద్ధం అవుతున్నారు. సోష‌ల్ మీడియాలో మ‌హేష్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ఓ ఫోటోను షేర్ చేశారు. మ‌హేష్ బాబు సిమ్మింగ్ ఫూల్‌లో ఈత కొట్టేందుకు రెడీ అయిన ఫోటోను న‌మ్ర‌తా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇక ఆ ఫోటోను చూసిన ఫ్యాన్స్ మ‌హేష్ బాబును చూసి ఫిదా అయిపోయారు. 

కొత్త సినిమా కోసం న్యూ గెట‌ప్

మ‌హేష్ బాబు  (Mahesh Babu) త‌న 28వ సినిమాను ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ కూడా త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. మ‌హేష్ బాబు బిజినెస్‌మేన్‌గా క‌నిపించ‌నున్నార‌ని టాక్. మ‌హేష్ లుక్ కొత్త‌గా క‌నిపించ‌నుంది. చాలా స్టైలిష్‌గా ఉండేలా త్రివిక్ర‌మ్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌హేష్ కూడా త‌న కొత్త సినిమా కోసం బాడీ బిల్ట్ చేస్తున్నారు. 

ట్రెండ్‌గా మారిన ప్రిన్స్ పిక్

మ‌హేష్ (Mahesh Babu) భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ త‌న ఇన్ స్టాలో ఓ ఫోటోను షేర్ చేశారు. మ‌హేష్ బాబు ష‌ర్ట్ లేకుండా స్విమ్మింగ్ ఫూల్‌లో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. మ‌హేష్ సూప‌ర్‌గా ఉన్నాడంటూ ఆ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది.

Read More: Sarkaru Vaari Paata: 'స‌ర్కారు వారి పాట' 100 రోజులు పూర్తి.. మ‌హేష్ (Mahesh Babu) అభిమానుల సంద‌డి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!