Mahesh Babu: "మహేష్ బాబూ.. మనం కూడా మీ నాన్నగారి ఐడియాను ఫాలో అవుదామా" : నాగార్జున (Nagarjuna)
టాలీవుడ్‌లో ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలను నిర్మించేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారు కలిసి చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అలాగే శోభన్‌బాబు, కృష్ణ కలిసి నటించిన చిత్రాలెన్నో ఆ రోజులలో సూపర్ హిట్ అయ్యాయి.
మన జనరేషన్ విషయానికి వస్తే, ఇటీవలే విడుదలైన RRR మళ్లీ మల్టీ స్టారర్ సినిమాలపై నిర్మాతలకు ఆశ కల్పిస్తోంది. ఆనాటి ట్రెండ్ మళ్లీ మొదలవనుంది. మన పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.
ఈ మధ్యకాలంలో, హీరో నాగార్జున (Nagarjuna), ప్రిన్స్ మహేష్ బాబుల మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఓ చిత్రమైన సంభాషణ చర్చనీయాంశమైంది. నాగార్జున, మహేష్ బాబుతో ఓ మల్టీస్టారర్ సినిమా తీస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
మహేష్‌తో నాగ్ సినిమా!
కింగ్ నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమా ట్రైలర్‌ను మహేష్ బాబు (Mahesh Babu) విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబుకు నాగార్జున కృతజ్ఞతలు చెబుతూ.. 'నాతో కలిసి సినిమా చేస్తావా ' అని ప్రశ్నించారు. 'మహేష్ ! 29 ఏళ్ల క్రితం మీ నాన్నగారు 'వారసుడు ' సినిమా కోసం నన్ను కలిశారు. మేము ఇద్దరం కలిసి సినిమా చేసినప్పుడు చాలా సంతోషించాను. మనం కూడా ఓ సినిమా ఎందుకు చేయకూడదు?' అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.
మహేష్ రిప్లై
అక్కినేని నాగార్జున ( Nagarjuna) (Nagarjuna) ట్వీట్‌కు మహేష్ బాబు రియాక్ట్ అయ్యారు. 'మీతో కలిసి సినిమా చేయడం అంటే, నాకు సంతోషమే. కచ్చితంగా ఇద్దరం కలిసి ఓ సినిమా చేసేలా ప్లాన్ చేద్దాం' అని మహేష్ నాగార్జున ట్విట్‌కు రిప్లై ఇచ్చారు.
నాగార్జున, మహేష్ బాబుల ట్విట్టర్ మెసేజ్‌లు ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. ఇద్దరు అగ్ర హీరోలతో సినిమా అంటే, ఓ రేంజ్‌లో అంచనాలు ఉంటాయి. ఇక నాగార్జున ఈ మాటను 'సరదాగా అన్నారా.. లేదా నిజంగానే అన్నారా ' అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ఏదైతేనేం.. మహేష్ బాబు, నాగార్జున కాంబోలో సినిమా వస్తే బొమ్మ అదుర్స్ అంటున్నారు ప్రేక్షకులు.
Read More: The Ghost : 'ది ఘోస్ట్' ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు(Mahesh Babu)