Ram Pothineni : రామ్ పోతినేని కథానాయకుడిగా వస్తున్న "ది వారియర్" థియేట్రికల్ ట్రైలర్ అదుర్స్ !

Updated on Jul 02, 2022 01:10 PM IST
ది వారియర్ (The Warriorr) చిత్రంలో క్రితిశెట్టి, అక్షర గౌడ, నదియా, భారతీరాజా, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ది వారియర్ (The Warriorr) చిత్రంలో క్రితిశెట్టి, అక్షర గౌడ, నదియా, భారతీరాజా, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

టాలీవుడ్ పరిశ్రమలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా రామ్ పోతినేనికి (Ram Pothineni) ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన ఇటీవలే నటించిన ‘ది వారియర్’ (The Warriorr) సినిమా ట్రైలర్ నిన్నే విడుదల అయ్యింది. తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కించిన ఈ సూపర్ డూపర్ యాక్షన్ సినిమాలో రామ్ పోలీస్ అధికారి పాత్రలో నటించనున్నారనే విషయం తెలిసిందే. 

ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. అలాగే ఈ సినిమా పోస్టర్లు, టీజర్ అభిమానులను ఒక్క లెక్కలో అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే రిలీజైన ట్రైలర్ కూడా అభిమానులను ఆకట్టుకునే విధంగానే ఉందని చెప్పాలి. చాలా వైవిధ్యమైన లుక్‌లో రామ్ ఈ ట్రైలర్‌లో నటించడం విశేషం. 

ప్రతి నాయకుడిగా ఆది పినిశెట్టి

ముఖ్యంగా ఈ ట్రైలర్‌లో ప్రతినాయకుడిగా నటిస్తున్న ఆది పినిశెట్టి (Aadi Pinisetty) పాత్రకు పెద్దపీట వేశారు డైరెక్టర్. అతని హావభావాలు, డైలాగ్ డెలివరీ అద్భుతంగానే ఉన్నాయని చెప్పాలి.  గురు పాత్రలో ఆయన తనదైన శైలిలో ఓ పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. రామ్‌తో సమానంగా ఆ పాత్ర సినిమాలో దుమ్మురేపనుందని తెలుస్తోంది. 

 

దేవీశ్రీప్రసాద్ సంగీతానికి సూపర్ రెస్పాన్స్

ది వారియర్ సినిమాను జులై 14 తేదిన వరల్డ్ వైడ్‌గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సంకల్పిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా.. శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ది వారియర్ తెరకెక్కనుంది. 

ది వారియర్ (The Warriorr) చిత్రంలో క్రితిశెట్టి, అక్షర గౌడ, నదియా, భారతీరాజా, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించారు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే బుర్రా సాయిమాధవ్ సంభాషణలను అందిస్తున్నారు. 

Read More: రామ్ పోతినేని న‌టించిన 'ది వారియ‌ర్' ప్రత్యేకతలు ఇవే! ఈ సినిమా టాప్ 10 విశేషాలు మీకోసం !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!