Ram Pothineni: మరో స్టార్‌‌ డైరెక్టర్‌‌తో సినిమా చేయడానికి ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కమిటయ్యాడా?

Updated on Jun 30, 2022 10:35 PM IST
రామ్ పోతినేని, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్
రామ్ పోతినేని, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్

క్లాస్​ సినిమాలతో లవర్​బాయ్​గా అలరిస్తూనే ఇస్మార్ట్​ శంకర్​, రెడ్​ సినిమాలతో తనలోని మాస్​ ఇమేజ్​ని బయటపెట్టాడు రామ్​ పోతినేని (Ram Pothineni). ‘ఇస్మార్ట్ శంకర్‌‌’తో కెరీర్‌‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన రామ్​ ప్రస్తుతం మంచి జోరుమీదున్నాడు. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘రెడ్’తో కూడా మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దీని తర్వాత తమిళ దర్శకుడు లింగుసామితో రామ్​ చేసిన ‘వారియర్’కు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రామ్ కెరీర్‌‌లోనే అత్యధిక స్థాయిలో జరిగింది.

‘వారియర్’ తర్వాత బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్‌తో అతను ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దాని చిత్రీకరణకు సిద్ధమవుతూనే కొత్త కథలు వింటున్నాడు రామ్. తాజా సమాచారం ప్రకారం అతను తమిళ విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్‌తో ఓ సినిమా చేసే అవకాశం ఉందట. వీరి మధ్య కథా చర్చలు జోరుగా జరుగుతున్నట్లు సమాచారం.

ఘర్షణ, కాకా కాకా సినిమా పోస్టర్లు

రీమేక్‌లతో మంచి హిట్‌లు..

గౌతమ్ గతంలో విక్టరీ వెంకటేష్‌తో ‘ఘర్షణ’ సినిమా చేశారు. అక్కినేని నాగచైతన్యతో ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలు తీశారు. ‘ఘర్షణ’ మూవీ తనే తీసిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘కాక్క కాక్క’కు రీమేక్. చైతూతో తీసిన రెండు సినిమాలు.. తమిళంలో శింబు హీరోగా చేసినవే. ఇప్పుడు రామ్‌తో కూడా గౌతమ్ ఒక రీమేక్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్, శింబు, నాగచైతన్య

తన ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన ఆర్థిక వివాదాల కారణంగా అనుకోకుండా చాలా గ్యాప్ తీసుకున్న గౌతమ్.. కొన్ని నెలల కిందటే శింబు హీరోగా ‘వెందు తనిందదు కాదు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ యాక్షన్ మూవీని సెప్టెంబరు 15న విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ కథనే తెలుగులో రామ్‌తో తీయాలని గౌతమ్ భావిస్తున్నాడట. స్క్రిప్టు రెడీగా ఉండడం, ఆల్రెడీ తీసిన సినిమా కావడంతో చాలా వేగంగా లాగించేయాలని గౌతమ్ భావిస్తున్నాడు. రామ్ పోతినేని (Ram Pothineni) ఓకే అంటే నిర్మాత దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఈ కాంబినేషన్‌లో నిజంగానే సినిమా వస్తుందేమో చూడాలి.

Read More: రామ్‌ పోతినేని (Ram Pothineni)– -బోయపాటి కాంబినేషన్‌ సినిమాలో తమిళ హీరో.. మల్టీస్టారర్‌గా తెరకెక్కనుందా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!