‘యశోద’(Yashoda) సినిమా నుంచి సమంత (Samantha) ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్.. సెప్టెంబర్ 9న టీజర్!

Updated on Aug 31, 2022 01:16 PM IST
వినాయక చవితి (Vinayaka Chavithi) సందర్భంగా సాలిడ్ అప్డేట్ ని అయితే అందించారు మేకర్స్.
వినాయక చవితి (Vinayaka Chavithi) సందర్భంగా సాలిడ్ అప్డేట్ ని అయితే అందించారు మేకర్స్.

టాలీవుడ్ బ్యూటీ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’ (Yashoda). సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ..తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాది ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని ఇంతకుముందు చిత్ర యూనిట్‌ వెల్లడించారు. అయితే ఇప్పుడు చిత్రం విడుదల వాయిదా పడింది. 

'యశోద' (Yashoda) మూవీని హరి – హరీష్ ద్వయం తెరకెక్కించగా శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇటీవల విడుదల అయిన యశోద ఫస్ట్ లుక్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ గ్లింప్స్ వీడియోకి మంచి స్పందన వచ్చింది.   

ఈ నేపథ్యంలో.. వినాయక చవితి (Vinayaka Chavithi) సందర్భంగా సాలిడ్ అప్డేట్ ని అయితే అందించారు మేకర్స్. సమంతపై ఒక ఇంటెన్స్ పోస్టర్ ని రిలీజ్ చేసి ఈ సినిమా తాలూకా ఫస్ట్ టీజర్ ని అయితే ఈ సెప్టెంబర్ 9న సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

కాగా, 'యశోద' సినిమా కోసం సమంత (Samantha) కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేశారట. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. అయితే.. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్నారు. 

Read More: Yashoda Movie: టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న సమంత (Samantha) 'యశోద'.. సినిమా విడుదలలో ఆలస్యం!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!