నిత్యామీనన్ (Nithya Menen) తల్లి కాబోతోందా.. ప్రెగ్నెన్సీ కిట్ పోస్ట్ చేసిన బ్యూటీ.. షాక్ లో ఫ్యాన్స్!

Updated on Oct 28, 2022 05:13 PM IST
నిత్యామీనన్ (Nithya Menen Pregnency Kit) తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేస్తూ.. 'అద్భుతం మొదలైంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
నిత్యామీనన్ (Nithya Menen Pregnency Kit) తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేస్తూ.. 'అద్భుతం మొదలైంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Nithya Menen: ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు అభిమానులకు షాకుల మీద షాకులిస్తున్నారు. మొన్నటి వరకు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara) కవల పిల్లల విషయం జనాలకు ఊహించని షాక్ ఇవ్వగా.. తాజాగా టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. 

ఫాసిఫైయర్‏తోపాటు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ని నిత్యామీనన్ (Nithya Menen Pregnency Kit) తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేస్తూ.. 'అద్భుతం మొదలైంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె చేసిన పోస్ట్ పై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పోస్ట్ చేయడమేంటీ ?.. నీకు పెళ్లి జరిగిందా? తండ్రి ఎవరు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

తెలుగు చిత్రపరిశ్రమలో అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు నిత్యామీనన్ (Nithya Menen). కంటెంట్, పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని సినిమాలను సెలక్ట్ చేసుకోవడం నిత్యా స్టైల్. అందులో భాగంగానే ఇటీవల 'భీమ్లా నాయక్', 'తిరు' చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.

నటన పరంగా ఎలాంటి పాత్రలో అయినా జీవించగల నటి నిత్యా మీనన్. చైల్డ్ ఆర్టిస్టుగానే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అన్ని భాషాల చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలోని సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. కేరీర్ పరంగా తనకు నచ్చిన సినిమాలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలనే పోషిస్తూ వస్తోంది. అయితే, ఇప్పటి వరకూ పెళ్లికి దూరంగానే ఉంటున్న నిత్యామీనన్ (Nithya Menen) ప్రస్తుతం తల్లికాబోతున్నానని ప్రకటించింది.  

ఇకపోతే నిత్యా నిత్యామీనన్ (Nithya Menen) తల్లి కాబోతున్నారని తెలిసి కొందరు కంగ్రాట్స్ చెబుతుంటే ఇంకొందరు మాత్రం ఇది ఓ ప్రమోషన్ టెక్నిక్ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. తన తర్వాతి సినిమా అనౌన్స్ మెంట్ కోసం ఇలాంటి పోస్ట్ ద్వారా హింట్ ఇస్తుందని అంటున్నారు. ఇంకొందరు నెటిజన్లు మాత్రం ఈ పోస్ట్ కు అర్థం ఏంటో చెప్పాలంటూ కోరుతున్నారు. ఇక నిత్యామీనన్ ను స్పందిస్తేనే ఫుల్ క్లారిటీ రానుందని అంటున్నారు. 

Read More: దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నాకు మంచి ఫ్రెండ్.. పెళ్లి చేసుకోమని అడిగాడు : నిత్య మీనన్ (Nithya Menen)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!