రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) ట్రైలర్.. సత్యదేవ్, తమన్నా కెమిస్ట్రీ సూపర్

Updated on Dec 03, 2022 04:26 PM IST
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది.

ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా గడుపుతున్నాడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో సత్యదేవ్‌ (Satyadev). ఆయన హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) హీరోయిన్ గా నటించిన ఫీల్ గుడ్ ప్రేమకథా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియద‌ర్శి, సుహాసిని త‌దిత‌రులు ఇతర ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు.

క‌న్న‌డ‌లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు, న‌టుడైన నాగ‌శేఖ‌ర్ ఈ సినిమాతో తెలుగుకి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) చిత్రాన్ని వేదాక్ష‌ర ఫిల్మ్స్ నాగ‌శేఖ‌ర్ మూవీస్, మ‌ణికంఠ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్ పై భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబులు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’ (Gurthunda Seethakalam) చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ‘ఒకానొక సమయంలో దేవ్ అనే అబ్బాయి ఉండేవాడు’ అంటూ సత్యదేవ్ తన పాత్ర గురించ పరిచయం చేసే సంభాషణలతో మొదలైన ట్రైలర్ లో.. ఆయన మూడు విభిన్నమైన లవ్ స్టోరీలు కలిగిన వ్యక్తిగా కనిపించనున్నారు. ట్రైలర్ చివర్లో ఆయన చెప్పే.. ‘ప్రేమించడం అంటే మనకు ఇష్టమైన వాళ్ల కోసం ఇష్టమైంది చేయడమే కదా’ వంటి డైలాగ్స్ మనసుని హత్తుకునే విధంగా ఉన్నాయి.  

చిన్న నాటి నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు ప్రతి అబ్బాయి లైఫ్ లో లవ్ ఎవరితో, ఎంతవరకు నిజం ఎవరితో తన నిజమైన ప్రేమ జీవితం మిగులుతుంది అనే అంశాలు ఫీల్ గుడ్ గా ఉన్నాయి. అలాగే తమన్నా కూడా మంచి మెచ్యూర్ రోల్ లో కనిపిస్తుంది. ఇంకా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కనిపిస్తుంది. అలాగే నటుడు ప్రియదర్శితో.. సత్యదేవ్ (Satyadev) సంభాషణలు కూడా ట్రైలర్ లో ఆసక్తికరంగా ఉన్నాయి.  

‘గుర్తుందా శీతాకాలం’ సినిమా కన్నడలో బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించిన ‘లవ్‌ మాక్‌టైల్‌’కు రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రం గతేడాదే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాలతో రిలీజ్‌ డేట్‌ వాయిదా పడుతూ వచ్చింది. ‘గాడ్ ఫాదర్’ (GodFather) సినిమాలో సీరియస్ లుక్ లో కనిపించిన సత్యదేవ్ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారు. ఇందులో యంగ్ లుక్స్ లో కనిపించి మంచి ఎనర్టిటిక్ పర్పామెన్స్ ని కనబరిచాడు సత్యదేవ్.

Read More: బాలీవుడ్ లో సత్యదేవ్ (Satyadev) ఎంట్రీ అదిరిపోయిందిగా.. 'రామ్ సేతు' (Ram Setu) లో నటనతో ఆకట్టుకున్న యంగ్ హీరో!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!