సత్యదేవ్ (Satyadev) 'పాదరసం లాంటి మనిషి'.. తాజా సినిమా 'ఫుల్ బాటిల్' (Full Bottle) ఫస్ట్ లుక్ రిలీజ్!

Updated on Nov 02, 2022 03:09 PM IST
'ఫుల్ బాటిల్' (Full Bottle) చిత్రంలో సత్యేదేవ్‌ (Satyadev) 'మెర్క్యూరి సూరి'గా కనిపించనున్నాడు. ఇందులో ఆయన లుక్‌ కూడా డిఫరెంట్‌గా ఉంది.
'ఫుల్ బాటిల్' (Full Bottle) చిత్రంలో సత్యేదేవ్‌ (Satyadev) 'మెర్క్యూరి సూరి'గా కనిపించనున్నాడు. ఇందులో ఆయన లుక్‌ కూడా డిఫరెంట్‌గా ఉంది.

ఓవైపు హీరోగా.. మరోవైపు విలన్‌గా.. ఇంకోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ (Satyadev). రొటీన్ కు భిన్నంగా విభిన్నమైన సినిమాలతో తనదైన పంథాలో ముందుకు సాగుతున్నాడు ఈ వెర్సటైల్ యాక్టర్. 

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ (GodFather) సినిమాలో నెగెటివ్ రోల్ లో నటించి ఆకట్టుకున్నారు సత్యదేవ్. అలాగే హిందీలో రూపొంది దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామ్ సేతు’లోనూ కీలక పాత్ర పోషించి అలరించారు.

ఈ రెండు సినిమాల తర్వాత సత్యదేవ్ తర్వాతి సినిమా ఏంటా అని ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తన ఫ్యాన్స్‌కి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. సత్యదేవ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫుల్ బాటిల్' (Full Bottle). శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే విభిన్నమైన కథ, కథనాలతో వినూత్నమైన క్యారెక్టరైజేషన్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

నటుడిగా తానేంటో ఇప్పటికే నిరూపించుకున్న సత్యదేవ్ (Satyadev).. ఇప్పుడు తానే నిర్మాతగా మారి ఎస్‌డీ కంపెనీ పేరుతో ఓ నిర్మాణ సంస్థ‌ని ప్రారంభించాడు. ఈ సంస్థ నుంచి వస్తున్న చిత్రమే 'ఫుల్ బాటిల్‌'. ఇందులో హీరోయిన్ గా సంజనా ఆనంద్ నటిస్తోంది. తాజాగా ఈ మూవీలోని సత్యదేవ్ పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.

'ఫుల్ బాటిల్' చిత్రంలో సత్యేదేవ్‌ మెర్క్యూరి సూరిగా (Mercury Soori) కనిపించనున్నాడు. ఇందులో ఆయన లుక్‌ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఆల్ట్రా మోడ్రన్ హెయిర్ కట్ తో చెవికి శిలువ లాంటి చెవి పోగుతో పాటు రెండు చేతుల్లో లిక్కర్ కలిపిన గ్లాసులు పట్టుకుని సత్యదేవ్ కనిపిస్తున్న తీరు కొత్తగా ఉంది. 

ఇక, పోస్టర్ (Full Bottle First Look Poster) పై కాకినాడ పోర్ట్ లైట్ హౌస్, రెండు పుల్ బాటిల్స్, కొరమీను చేపలు, కింద రెండు ఆటోలు, ఆ కింద సముద్రంలో ఓ పడవ, రెండు మైక్ సెట్ లు చూస్తుంటే సినిమా కాన్సెప్ట్ చాలా వెరైటీగా ఉంటుందని తెలియజేస్తున్నాయి. కాగా, సినిమా అంతా కాకినాడ పోర్ట్ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. 

ఈ సినిమాను ఎస్డీ కంపెనీ, శర్వంత్రమ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి, సత్యదేవ్ (Satyadev) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇక సత్యదేవ్‌ నటించిన తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. దీనితో పాటు ‘కృష్ణమ్మ’ అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. 

Read More: బాలీవుడ్ లో సత్యదేవ్ (Satyadev) ఎంట్రీ అదిరిపోయిందిగా.. 'రామ్ సేతు' (Ram Setu) లో నటనతో ఆకట్టుకున్న యంగ్ హీరో!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!