అలీ నుంచి సుడిగాలి సుధీర్‌‌ వరకు..హీరోలుగానూ సినిమాలు చేసిన టాప్‌10 టాలీవుడ్ కమెడియన్లు

Updated on Dec 15, 2022 09:53 PM IST
కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే టాలీవుడ్ కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు
కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే టాలీవుడ్ కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు

సినిమాకు ముఖ్యమైనది కథ. కథతోపాటు కామెడీ కూడా సినిమా సక్సెస్‌లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే హీరోహీరోయిన్లతోపాటు కమెడియన్లను ఎంపిక చేయడంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు మన దర్శకనిర్మాతలు. సినిమాలో కామెడీ బాగుందని టాక్ వచ్చిందంటే ఇక ఆ సినిమా కలెక్షన్లకు తిరుగుండదు. అన్ని ఇండస్ట్రీలలోనూ కమెడియన్లు ఉన్నప్పటికీ టాలీవుడ్‌లో వారి సంఖ్య కాస్త ఎక్కువని చెప్పాలి.

పాత సినిమాల్లో అల్లు రామలింగయ్య నుంచి నేడు సప్తగిరి, సునీల్, శ్రీనివాసరెడ్డి వరకు ప్రేక్షకుల ఆదరణ పొందినవారే. పాత తరం కమెడియన్లు అల్లు రామలింగయ్య, రాజబాబు, చలం తదితరులకు ఉన్న  ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని వారిని ప్రధాన పాత్రల్లో పెట్టి సినిమాలు తెరకెక్కించారు. ప్రస్తుత తరంలో అలీ, సునీల్‌తోపాటు పలువురు కమెడియన్లు హీరోలుగా సినిమాలు చేశారు. తాజాగా సుడిగాలి సుధీర్‌‌ ఈ లిస్ట్‌లో చేరిపోయారు. కమెడియన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే హీరోలుగా చేస్తున్న టాప్‌10 కమెడియన్లకు సంబంధించిన విశేషాలు పింక్‌విల్లా వ్యూయర్స్ కోసం ప్రత్యేకం..

కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే టాలీవుడ్ కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు

అలీ (Ali) :

చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లోకి వచ్చారు అలీ. 1981లో విడుదలైన సీతాకోకచిలుక సినిమాలో బాలనటుడిగా చేశారు. అప్పటినుంచి నిర్విరామంగా సినిమాలు చేస్తున్న అలీ.. పలు సినిమాల్లో హీరోగానూ నటించారు. కమెడియన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే హీరోగా కూడా ఆయనకు ఆఫర్లు వచ్చాయి.

మాయలోడు, పిట్టలదొర, అలీ బాబా అద్భుత దీపం, ఘటోత్కచుడు, సర్కస్ సత్తిపండు, యమలీల, అక్కుం బక్కుం, హంగామా, ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’తోపాటు పలు సినిమాల్లో హీరోగా నటించారు అలీ. కొన్ని సినిమాలు సూపర్‌‌హిట్‌గా నిలిచాయి. కమెడియన్‌గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలీ.. హీరోగా కూడా మంచి మార్కులే వేయించుకున్నారు. తన నటనతో నవ్వులు పూయించడమే కాదు.. ప్రేక్షకులతో కన్నీళ్లు కూడా పెట్టించగలనని నిరూపించుకున్నారు.

కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే టాలీవుడ్ కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు

వేణుమాధవ్ (Venumadhav) :

సూపర్‌‌స్టార్ కృష్ణ హీరోగా నటించిన సంప్రదాయం సినిమాతో టాలీవుడ్‌లోకి కమెడియన్‌గా వచ్చారు వేణుమాధవ్. విభిన్నమైన నటన, డైలాగ్ డిక్షన్‌తో కామెడీ చేస్తూ స్టార్ కమెడియన్‌ లిస్ట్‌లో చేరారు. విలన్‌ పక్కన ఉంటూనే తన డైలాగ్స్‌తో కామెడీ చేసే క్యారెక్టర్లకు పెట్టింది పేరుగా ఎదిగారు వేణుమాధవ్.

కమెడియన్‌గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే వేణుమాధవ్‌కు హీరోగా కూడద చేసే అవకాశాలు వచ్చాయి. హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం వంటి సినిమాల్లో హీరోగా చేసి మంచిపేరు తెచ్చుకున్నారు. వీటిలో ప్రేమాభిషేకం సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించిన వేణుమాధవ్.. 2019, సెప్టెంబర్‌‌ 25వ తేదీన కన్నుమూశారు.

కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే టాలీవుడ్ కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు

బ్రహ్మానందం (Brahmanandam) :

చంటబ్బాయి సినిమాతో టాలీవుడ్‌లోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చారు బ్రహ్మానందం. డైలాగ్ డిక్షన్, ముఖ కవళికలతో ప్రేక్షకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించగలిగే సత్తా ఆయన సొంతం. ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరు హీరోల సినిమాల్లోనూ నవ్వులు పూయించారు బ్రహ్మానందం.

కొన్ని సంవత్సరాలపాటు బ్రహ్మానందం లేకుండా సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన కోసమే సినిమాకు ప్రేక్షకులు వచ్చేవారు. అంతేకాదు, ఆయన కామెడీతోనే సూపర్‌‌హిట్‌ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కామెడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం హీరోగా కూడా సినిమాలు చేశారు. బాబాయ్ హోటల్, జఫ్ఫా సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించి మెప్పించారు.

కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే టాలీవుడ్ కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు

సునీల్ (Suneel) :

నువ్వేకావాలి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సునీల్. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌తో నవ్వులు పూయించే సునీల్.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేస్తున్నారు.

అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. అనంతరం చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్‌ను అందుకోలేదు. ప్రస్తుతం సినిమాలతోపాటు ఓటీటీలో కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు సునీల్.

కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే టాలీవుడ్ కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు

ప్రియదర్శి (Priyadarshi) :

శ్రీకాంత్ హీరోగా సతీష్ కాశెట్టి దర్శకత్వం వహించిన టెర్రర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ప్రియదర్శి. పెళ్లిచూపులు సినిమాలోని నటనకు మంచి పేరు రావడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. హిందీ, తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేశారు ప్రియదర్శి.

ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మొదటి సినిమా మల్లేశం. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక, మెయిల్, మిఠాయి సినిమాల్లో కూడా ప్రధాన పాత్రలు పోషించారు. జాతిరత్నాలు, ఒకే ఒక జీవితం సినిమాల్లో పూర్తి స్థాయి పాత్రల్లో నటించి తన కామెడీతో మెప్పించారు ప్రియదర్శి.

కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే టాలీవుడ్ కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు

సప్తగిరి (Sapthagiri) :

బొమ్మరిల్లు సినిమాతో టాలీవుడ్‌లోకి కమెడియన్‌గా అడుగుపెట్టారు సప్తగిరి. పరుగు సినిమాతో పాపులర్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా స్థిరపడాలని వచ్చిన సప్తగిరి.. తన బాడీ లాంగ్వేజ్, స్పష్టమైన డైలాగ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ కమెడియన్‌గా ఎదిగారు.   

సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ, వజ్ర కవచ ధర గోవింద సినిమాల్లో హీరోగా నటించారు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఎమోషన్ సీన్లలో కన్నీళ్లు పెట్టించారు. హీరోగా చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్‌ సాధించకపోవడంతో కమెడియన్‌గా కొనసాగుతున్నారు.  

కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే టాలీవుడ్ కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు

షకలక శంకర్ (Shakalaka Shankar)

జబర్దస్త్‌ కామెడీ షోతో పాపులర్ అయ్యారు షకలక శంకర్. ఈ షోలో శ్రీకాకుళం యాసతో డైలాగులు చెబుతూ కడుపు చెక్కలయ్యేలా నవ్వించేవారు. కామెడీ షోలో నవ్వులు పంచుతూనే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టారు శంకర్. కమెడియన్‌గా స్థిరపడే ప్రయత్నాలు చేశారు.

కమెడియన్‌గా సినిమాల్లో నటిస్తూనే హీరోగా కూడా చేశారు షకలక శంకర్. శంభో శంకర్ సినిమాలో హీరోగా నటించారు.

కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే టాలీవుడ్ కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) :

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోతో పాపులర్ అయిన మరో కమెడియన్ సుడిగాలి సుధీర్. ఈ షోలో టీమ్ లీడర్‌‌గా చేస్తూనే పలు షోలకు యాంకర్‌‌గా వ్యవహరించారు. జబర్దస్త్‌లో తన టీమ్‌ మేట్స్‌ గెటప్‌ శీను, ఆటో రాంప్రసాద్‌లతో కలిసి త్రీ మంకీస్ సినిమా చేశారు.

సాఫ్ట్‌వేర్ సుధీర్, గాలోడు, వాంటెడ్ పండుగాడ్ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో హీరోగా కొనసాగుతున్నారు. జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీతో మంచి ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్న సుధీర్.. తన డాన్స్, నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే టాలీవుడ్ కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు

శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy) :

ఇష్టం సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఇడియట్‌ సినిమాతో పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో రవితేజ స్నేహితుడిగా నటించి మంచిపేరు తెచ్చుకున్నారు. సింహాద్రి, వెంకీ, దేశముదురు, ఢీ, పరుగు, బింబిసార, కార్తికేయ2 సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు.

జంబలకిడిపంబ, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాల్లో హీరోగా నటించిన శ్రీనివాస రెడ్డి, ముగ్గురు మొనగాళ్లు, ఆనందోబ్రహ్మ సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించారు.

కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే టాలీవుడ్ కమెడియన్లు.. హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు

సత్య (Satya) :

హీరో నితిన్ నటించిన ద్రోణ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా పనిచేసిన సత్య.. నిఖిల్ సిద్దార్థ్‌ హీరోగా నటించిన కళావర్ కింగ్‌ సినిమాతో టాలీవుడ్‌కు కమెడియన్‌గా పరిచయమయ్యారు. పిల్ల జమిందార్, గబ్బర్‌‌సింగ్, స్వామి రారా, కార్తికేయ, కార్తికేయ2 సినిమాలతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నారు సత్య.

2010లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సత్య.. ఇప్పటివరకు దాదాపు 50కు పైగా సినిమాల్లో కమెడియన్‌గా నటించారు. ఇక, వివాహ భోజనంబు సినిమాతో హీరోగా కూడా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలోని నటనకుగాను సత్యకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

Read More : 2022లో విడుదలైన టాప్‌5 హర్రర్, థ్రిల్లర్ సినిమాలు.. ఐఎండీబీ రేటింగ్స్‌లోనూ టాప్‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!