మరో సినిమాకు ఓకే చెప్పిన డార్లింగ్ ప్రభాస్ (Prabhas)?.. బాలీవుడ్ దర్శకుడితో భారీ యాక్షన్ మూవీకి ప్లాన్! 

Updated on Nov 07, 2022 05:40 PM IST
షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’ సినిమా తీస్తున్న సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand)తో ఓ మూవీ చేసేందుకు ప్రభాస్ (Prabhas) ఓకే చెప్పారని సమాచారం 
షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’ సినిమా తీస్తున్న సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand)తో ఓ మూవీ చేసేందుకు ప్రభాస్ (Prabhas) ఓకే చెప్పారని సమాచారం 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఎప్పుడూ లేనంతగా వెంటవెంటనే సినిమాలు చేస్తున్నారు. కెరీర్‌లో ఇంత వేగంగా ఆయన ఎప్పుడూ చిత్రాలు చేయలేదు. ఒక సినిమా తర్వాత మరో సినిమాలో నటిస్తూ వచ్చిన డార్లింగ్.. ఇప్పుడు వరుస చిత్రాల్లో యాక్ట్‌ చేస్తూ జెట్ స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ‘ఆదిపురుష్’ మూవీ షూటింగ్‌ను ప్రభాస్ పూర్తి చేశారు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అనుకున్నప్పటికీ వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ పనులను పూర్తి చేయడానికి మరికొంత సమయం పట్టేలా ఉండటంతో మేకర్స్ మూవీని పోస్ట్‌పోన్ చేశారు. 

‘ఆదిపురుష్’ చిత్రానికి సంబంధించి తన పనులు పూర్తవ్వడంతో మిగిలిన సినిమాల షూటింగులతో ప్రభాస్ బిజీబిజీగా ఉన్నారు. ఏకకాలంలో ప్రశాంత్ నీల్ సలార్’, నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల్లో నటిస్తూ డార్లింగ్ ఊపిరిసలపనంత బిజీగా ఉన్నారు. అయినా క్రేజీ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో మరో సినిమాకు ఆయన కమిటయ్యారు. అదే సమయంలో ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్’ అనే చిత్రంలో నటించేందుకూ ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

ఒకేసారి అన్ని చిత్రాలు ఎలా ఫినిష్ చేస్తారు?

సెట్స్ మీద ఉన్న మూడు సినిమాల షూటింగులు ఎప్పుడు పూర్తవుతాయనేది తెలియదు. అన్నీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలే కావడం గమనార్హం. వీటికి డేట్స్ అడ్జస్ట్ కావడం లేదంటే ఇప్పుడు మరో మూవీకి ప్రభాస్ పచ్చజెండా ఊపారంటూ వార్తలు వస్తున్నాయి. ఇది విని డార్లింగ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారట. అంగీకరించిన సినిమాలు పూర్తి చేయడానికి డేట్స్ కుదరని పరిస్థితుల్లో కొత్త చిత్రానికి ఎలా ఓకే చెప్పారంటూ ఆయన అభిమానులు షాక్‌కు గురవుతున్నారని తెలుస్తోంది. 

మరో మూవీకి ప్రభాస్ (Prabhas) పచ్చజెండా ఊపారంటూ వార్తలు వస్తున్నాయి

మరో హిందీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్?

ప్రభాస్‌తో మూవీ చేయాలని బాలీవుడ్ మేకర్స్ ఎప్పుటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ‘ఆదిపురుష్’తో డార్లింగ్ మూవీ సెట్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ పనులను జరుపుకుంటోంది. ఇదిలాఉంటే.. బాలీవుడ్‌లో మరో మూవీ చేయడానికి ప్రభాస్ రెడీ అవుతన్నారట. యాక్షన్ ఫిల్మ్స్ స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టుకు ప్రభాస్ ఓకే చెప్పారట. ఈ మూవీని టాలీవుడ్‌లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించడానికి ప్లాన్ చేస్తోందని సమాచారం. 

దర్శకుడికి అన్ని కోట్ల రెమ్యూనరేషనా?

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రంలో ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ కూడా భాగం కానుందని రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో ‘పఠాన్’ సినిమాను తెరకెక్కిస్తున్న సిద్ధార్థ్ ఆనంద్.. ప్రభాస్‌తో చేయబోయే చిత్రం కోసం రూ.80 కోట్ల మేర రెమ్యూనరేషన్‌ను డిమాండ్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి నిర్మాతలు కూడా ఓకే అన్నారట. దీనిపై క్లారిటీ రావాలంటే నిర్మాణ సంస్థ లేదా దర్శకుడు సిద్ధార్థ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. 

Read more: తేనెలొలుకు తెలుగు భాషంటే.. విశ్వనటుడు కమల్ హాసన్‌ (Kamal Haasan)కు ఎందుకంత అభిమానమో తెలుసా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!