బాలీవుడ్‌ (Bollywood)లో సరికొత్త రికార్డు సృష్టించిన ‘ఆదిపురుష్’ (Adipurush) టీజర్ 

Updated on Oct 06, 2022 11:44 PM IST
ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది
ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఆదిపురుష్’  (Adipurush) చిత్రం టీజర్ సంచలనం సృష్టిస్తోంది. అయోధ్య వేదికగా విడుదలైన ఈ టీజర్ విడుదలైన 17 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 88 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. 

బాలీవుడ్‌ (Bollywood)లో ఫాస్టెస్ట్‌ 50 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన టీజర్‌గా రికార్డు సృష్టించింది. కేజీఎఫ్​–2 రికార్డును ఆదిపురుష్ బ్రేక్ చేసింది. అలాగే 932కే లైక్స్ సాధించి బాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది. ఇటీవల విడుదలైన హృతిక్ నటించిన విక్రమ్ వేద 931కే లైక్స్‌తో హిందీ టీజర్స్‌లో రెండో స్థానంలో ఉంది.

ఇక ‘ఆదిపురుష్’ టీజర్‌పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొంతమంది అభిమానులు ఈ టీజర్ అద్భుతమని, విజువల్ వండర్‌ను తలపిస్తోందని అంటున్నారు. రాముడిగా ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం టీజర్‌లో ప్రభాస్ లుక్స్, విజువల్ ఎఫెక్ట్స్‌ బాగా లేవని పెదవి విరుస్తున్నారు.

‘ఆదిపురుష్’ టీజర్ కార్టూన్ వీడియోలా ఉందని.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘విక్రమ సింహా’ను ఇది గుర్తు చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కొందరు నెటిజన్స్ మాత్రం హాలీవుడ్ చిత్రాల బడ్జెట్‌తో పోలిస్తే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ తక్కువ నిర్మాణ వ్యయంతో, మంచి క్వాలిటీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆకట్టుకునేలా ఉందని ప్రశంసిస్తున్నారు.

ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్​ చిత్రంలో ప్రభాస్ సరసన జానకి పాత్రలో కృతీ సనన్ నటిస్తున్నారు. రావణుడి పాత్రలో సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  

Read more: 'ఆదిపురుష్' (Adipurush) గురించి ఆసక్తికర వార్త.. హిందీలో ప్రభాస్ కు (Prabhas) డబ్బింగ్ చెప్పింది ఎవరంటే..?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!