ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) సినిమా నుంచి కీరవాణి తప్పుకున్నారా? 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' పై కొత్త అప్డేట్ !

Updated on Aug 24, 2022 04:07 PM IST
ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' నుంచి కీర‌వాణి త‌ప్పుకున్నారంటూ  వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.
ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' నుంచి కీర‌వాణి త‌ప్పుకున్నారంటూ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Hari Hara Veera Mallu:టాలీవుడ్ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) సినిమా కోసం అభిమానులు ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే పవన్ 'భీమ్లానాయ‌క్' చిత్రంలో నటించారు. ప్రస్తుతం ప‌వ‌ర్ స్టార్ నాలుగు సినిమాల్లో న‌టిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న చిత్రాల్లో 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ప్ర‌త్యేక‌మైంది. అయితే ఈ  ప్రాజెక్టు నుండి సంగీత ద‌ర్శ‌కుడు ఎమ్.ఎమ్‌. కీర‌వాణి త‌ప్పుకున్నారంటూ పలు వార్త‌లు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

పాన్ ఇండియా సినిమా అట‌!

క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా తెర‌కెక్కుతోంది. క‌రోనా కార‌ణంగా బ్రేక్ ప‌డిన ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన‌ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'  పోస్ట‌ర్లు ఈ సినిమాపై అభిమానుల అంచనాల‌ను నిజంగానే పెంచేశాయి.

'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ (Pawan Kalyan) కు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు. బాలీవుడ్ స్టార్లు అర్జున్ రామ్‌పాల్, న‌ర్గిస్ ఫ‌క్రి కీల‌క‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' చిత్రాన్ని మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఏఎమ్ ర‌త్నం, ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నారు. 

 

ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' నుంచి సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి త‌ప్పుకున్నారంటూ పలు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

కీర‌వాణి సంగీతం ఉన్న‌ట్టా.. లేనట్టా!

ఎమ్.ఎమ్‌. కీర‌వాణి 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా నుంచి త‌ప్పుకున్నారని చెబుతూ, పలు వార్త‌లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే కీర‌వాణి ఇలాంటి నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారో తెలియాల్సి ఉంది. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబ‌ర్ 2 న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమాకు సంబంధించి కొత్త అప్‌డేట్స్‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇక  కీర‌వాణి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారా? లేదా? అనే దానిపై కూడా ఓ క్లారిటీ వస్తుంది. 

ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' నుంచి సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి త‌ప్పుకున్నారంటూ పలు వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

సినిమా ఆగిపోలేదు - నిర్మాత‌

'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాల‌ని నిర్మాతలు భావిస్తున్నారు.  అలాగే ఈ సినిమా ఆగిపోయింద‌నే వార్త‌లు కూడా చ‌క్క‌ర్లు కొట్టాయి. ఇటీవలే జ‌రిగిన చిరంజీవి బర్త్ డే వేడుక‌ల్లో, నిర్మాత ఏఎమ్ ర‌త్నం ఇదే విషయంపై స్పందించారు. ప‌వ‌న్ సినిమా ఆగిపోలేదని తెలిపారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేస్తున్నామ‌న్నారు. 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' భారీ బ‌డ్జెట్ సినిమా అని.. వ‌చ్చే ఏడాది మార్చి 30 తేదిన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామ‌ని ప్రకటించారు. 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమాను అన్ని భాష‌ల్లో రిలీజ్ చేస్తామ‌ని తెలిపారు.

Read More : హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) : ఈ పవర్ స్టార్ సినిమా ఎందుకు ప్రత్యేకమంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!