"హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు"గా అద‌ర‌గొట్ట‌నున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan).. రెగ్యుల‌ర్ షూటింగ్ అప్‌డేట్స్

Updated on Jul 26, 2022 07:51 PM IST
 ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) సినిమా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'  షూటింగ్ ఆగ‌స్టు నుంచి ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. 
ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) సినిమా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్ ఆగ‌స్టు నుంచి ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. 

Hari Hara Veera Mallu: టాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయోన‌ని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. 'భీమ్లానాయ‌క్' సినిమాతో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌క్సెస్ సాధించారు. ఇక అదే జోష్‌తో ప‌వ‌ర్ స్టార్ నాలుగు సినిమాల్లో న‌టిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న చిత్రాల్లో 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' ప్ర‌త్యేక‌మైంది. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా తెర‌కెక్కుతుంది. క‌రోనా కార‌ణంగా బ్రేక్ ప‌డిన ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

 ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) సినిమా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'  షూటింగ్ ఆగ‌స్టు నుంచి ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. 

రెగ్యుల‌ర్ షూట్‌కు ప‌వ‌న్

నిజానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. క‌రోనా త‌ర్వాత కూడా ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాక‌పోవ‌డంతో ప‌వ‌న్ అభిమానులు ఆందోళ‌న చెందారు. త‌మ అభిమాన హీరో సినిమా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ ప‌వ‌న్ అభిమానుల‌ను ఖుషీ చేస్తుంది. 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా షూటింగ్ ఆగ‌స్టు నుంచి ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. 

 ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) సినిమా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'  షూటింగ్ ఆగ‌స్టు నుంచి ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. 

సంక్రాంతి పండుగ‌కు ప‌వ‌న్ సినిమా!

ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) న‌టిస్తున్న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా ఆగ‌స్టు నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు షూటింగ్ జరుపుకొని, ఒక షెడ్యూల్ పూర్తి చేయనుంది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన‌ 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా పోస్ట‌ర్లు ఈ సినిమాపై అభిమానుల అంచనాల‌ను నిజంగానే పెంచేశాయి.

 ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) సినిమా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'  షూటింగ్ ఆగ‌స్టు నుంచి ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. 

ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ న‌టిస్తున్నారు. అర్జున్ రామ్‌పాల్, న‌ర్గిస్ ఫ‌క్రి కీల‌క‌పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' చిత్రాన్ని మెగా సూర్య ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఏఎమ్ ర‌త్నం, ద‌యాక‌ర్ రావు నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్‌ కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Read More : హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) : ఈ పవర్ స్టార్ సినిమా ఎందుకు ప్రత్యేకమంటే?

 ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) సినిమా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'  షూటింగ్ ఆగ‌స్టు నుంచి ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!