మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాలో ఐటమ్‌ సాంగ్ చేయనున్న తమన్నా భాటియా!

Updated on Jul 06, 2022 11:47 PM IST
మెగాస్టార్‌‌ చిరంజీవి (Chiranjeevi)   వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. రాంచరణ్‌తో కలిసి నటించిన ఆచార్య  ఫలితం కొంత నిరాశ పరిచింది.
మెగాస్టార్‌‌ చిరంజీవి (Chiranjeevi) వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. రాంచరణ్‌తో కలిసి నటించిన ఆచార్య ఫలితం కొంత నిరాశ పరిచింది.

మెగాస్టార్‌‌ చిరంజీవి (Chiranjeevi)   వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. రాంచరణ్‌తో కలిసి నటించిన ‘ఆచార్య‘ సినిమా ఫలితం కొంత నిరాశ పరిచింది. ప్రస్తుతం చిరంజీవి ‘గాడ్‌ఫాద‘ర్‌‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇటీవలే ‘గాడ్‌ఫాదర్’ సినిమాకు సంబంధించి చిరంజీవి లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ లుక్‌తో సినిమాపై చిరంజీవి అభిమానులు, సినీ ప్రేమికులకు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

చిరంజీవి (Chiranjeevi)  సినిమాపై ఎప్పుడు ఎటువంటి అప్‌డేట్‌ వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. ఇక, ప్రస్తుతం చిరంజీవి బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తూ వాటిని పూర్తి చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్‘ సినిమాతోపాటు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా చేస్తున్నారు.ఈ క్రమంలో ఆయన సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. అందంతోపాటు నటనతో ప్రేక్షకులను మెప్పించి అభిమానులను సంపాదించుకున్నారు. ఒక పక్క సినిమాలు చేస్తూనే, ఐటమ్‌ సాంగ్‌లకు కూడా ఓకే చెప్పే తమన్నా.. ఇప్పటికే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌ చేసి క్రేజ్‌ తెచ్చుకున్నారు.

జై లవకుశ స్వింగ్ జరా పాటలో తమన్నా

ట్విటర్ ఇంటరాక్షన్‌లో..

తాజాగా తమన్నా ట్విటర్‌‌లో అభిమానులతో ఇంటరాక్ట్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు తమన్నా ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఒక సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. ‘భోళా శంకర్‌‌‘ సినిమా స్పెషల్ సాంగ్‌లో చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ చేస్తారని ఆశించవచ్చా‘ అని ఓ అభిమాని తమన్నాను ప్రశ్నించారు. ఈ ప్రశ్నను తమన్నా.. ఖండించలేదు. అంతేకాకుండా ‘మీరు నిరాశ చెందరు అని హామీ ఇస్తున్నాను‘ అని కూడా చెప్పింది తమన్నా.

ఇదే నిజమైతే చిరంజీవి – తమన్నా డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ తప్పకుండా ఫిదా అవుతారు. ఇప్పటికే తమన్నా.. స్వింగ్ జర, డాంగ్‌ డాంగ్‌ పాటలతో ఫ్యాన్స్‌ను అలరించారు . ఇప్పుడు చిరంజీవి(Chiranjeevi) తో ఆడిపాడే ఛాన్స్ నిజంగానే వచ్చిందా లేదా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే మరి.

Read More : Celebrity Love Marriages: సినీ 'ప్రేమ' బంధం .. డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న కథానాయికలు వీరే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!