Chiranjeevi: చిరంజీవి అభిమానులకు గుడ్‌న్యూస్‌.. మెగా154 రిలీజ్ అయ్యేది అప్పుడే?

Updated on Jun 24, 2022 04:58 PM IST
మెగా 154 సినిమా పోస్టర్
మెగా 154 సినిమా పోస్టర్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్‌ గుడ్‌న్యూస్ చెప్పింది. తమ బ్యానర్‌లో చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చి ఫ్యాన్స్‌ను సర్‌‌ప్రైజ్‌ చేసింది. చిరంజీవి 154వ ప్రాజెక్ట్‌గా రెడీ అవుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం ఉదయం సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌‌లో చేతిలో లంగరు పట్టుకుని చిరంజీవి నిలుచున్నట్టుగా కనిపిస్తున్నాడు. ‘బాక్సాఫీస్‌ వేటకు లంగరు తయారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతికి మెగా 154 విడుదల కానుంది’ అని పేర్కొంది.

మెగా 154 సినిమా పోస్టర్

మాస్‌ ఎలిమెంట్స్‌తో..

మాస్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఫుల్‌ మాస్‌ లుక్‌లో చిరు అభిమానులను అలరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించనున్నాడు. ఇక, ఈ సినిమాకి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్టు చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌పైన టైటిల్‌, టీజర్ త్వరలో ప్రకటించనున్నట్టు కూడా పోస్టర్‌‌పై రాసింది చిత్ర యూనిట్. చిరంజీవి (Chiranjeevi) హీరోగా చేస్తున్న ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌నే ఫైనల్ చేస్తారా లేదా అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు మరి.

Read More : Chiranjeevi: గోపీచంద్ (Gopichand) పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా చిరంజీవి !


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!