Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ సినిమాలో.. విలన్‌గా ఒకప్పటి యంగ్ హీరోయిన్ !

Updated on Jun 06, 2022 05:24 PM IST
నటి అంజలి, నందమూరి బాలకృష్ణ (Actress Anjali, Nandamuri Balakrishna)
నటి అంజలి, నందమూరి బాలకృష్ణ (Actress Anjali, Nandamuri Balakrishna)

Nandamuri Balakrishna: టాలీవుడ్‌లో 'అఖండ' సినిమా విజయంతో ఊపుమీదున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా  సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ యాక్షన్ సినిమా తీస్తున్నారు. మరోవైపు యంగ్ డైరెక్టర్‌ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో కూడా త్వరలో ఓ సినిమా రాబోతోంది. వీరిద్దరి కాంబోలో NBK108 రూపొందనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్ళడానికి ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ, ఈ సినిమాకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే పలు ఆసక్తికరమైన అప్ డేట్స్ కూడా బయటకు వస్తున్నాయి.

తండ్రి, కూతుళ్ళ సెంటిమెంట్ కథలో బాలయ్య బాబు 

ఈ సినిమా తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్ కథతో తెరకెక్కుతుందని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రంలో బాలయ్య తండ్రి పాత్రలో నటిస్తుండగా, పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల (Sree leela) ఆయన కూతురి పాత్ర పోషించనుందని, డైరెక్టర్ అనిల్ రావిపూడి స్వయంగా ‘ఎఫ్ 3’ (F3) ప్రమోషన్స్‌లో ఓపెన్ గా చెప్పేశాడు. ఇందులో హీరోయిన్ ప్రియమణి కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో కొత్త రూమర్ సైతం వెలుగులోకి వచ్చింది. 

ఈ సినిమాలో అంజలి (Anjali) నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించనుందనే టాక్ వినిపిస్తోంది. కాగా, గతంలో బాలయ్య సరసన 'డిక్టేటర్' సినిమాలో అంజలి నటించింది.  తరువాత బాలయ్యతో ఆమె చేసే సినిమా ఇదే అవుతుంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే... అఫీషియల్ ప్రకటన కోసం ఆగాల్సిందే.

అయితే, వరుసగా వస్తున్న వార్తలతో  NBK 108, పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి సైతం కామెడీ కంటే, యాక్షన్‌కే పెద్ద పీట వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాలయ్య సరసన శ్రుతిహాసన్

మరోవైపు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య రాయలసీమ నేపథ్యంలోనే నడిచే కథతో ఊరమాస్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా శ్రుతి హాసన్ (Shruti Hassan) నటిస్తోంది. ఈ దసరా పండుగకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మూవీ మేకర్స్.

ఇక అనిల్ రావిపూడి తరువాత బాలకృష్ణ ఎవరితో సినిమా చేస్తాడు? అనే విషయంపై కూడా బాలయ్య అభిమానుల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంత మంది పేర్లు వినిపిస్తుండగా.. అందులో ముఖ్యంగా బీవీఎస్ రవి పేరు ముందు వరుసలో ఉంది. మొత్తం మీద బాలయ్య బాబు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారడం విశేషం.

Read More: అఖండ సినిమా విజయాన్ని నాన్న ఎన్టీఆర్‌‌కు అంకితం చేస్తున్నా : బాలకృష్ణ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!