గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో 'అఖండ' (Akhanda) హంగామా.. హాజరైన బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను..!

Updated on Nov 25, 2022 04:50 PM IST
బాలకృష్ణ ప్రధాన పాత్రని పోషించిన 'అఖండ' (Akhanda) సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ (Pragya Jaiswal) ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించారు.
బాలకృష్ణ ప్రధాన పాత్రని పోషించిన 'అఖండ' (Akhanda) సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ (Pragya Jaiswal) ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించారు.

గోవాలో జరుగుతున్న 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా.. (IFFI) చలన చిత్రోత్సవాలలో సందడి చేశారు నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఆయన కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌ హిట్ సాధించి వన్ ఆఫ్ ది స్పెషల్ మూవీగా నిలిచిన 'అఖండ' (Akhanda) మూవీ ఈ చిత్రోత్సవాల్లో (53rd International Film Festival of India) స్క్క్రీనింగ్ అయింది.

బాలకృష్ణ ప్రధాన పాత్రని పోషించిన 'అఖండ' (Akhanda) సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ (Pragya Jaiswal) ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటించగా.. శ్రీకాంత్, పూర్ణ ఇతర కీలక పాత్రలు పోషించారు. బాలయ్య, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boayapati Srinu) కాంబినేషన్ నుంచి వచ్చిన ఈ హ్యాట్రిక్ చిత్రం బాలయ్య కెరీర్ లోనే రికార్డు గ్రాసర్ గా నిలిచింది. అంతే కాకుండా ఇటీవలి కాలంలో టాలీవుడ్ విజయవంతంగా అత్యధిక రోజులు థియేటర్స్ లో ప్రదర్శితం అయిన సినిమాగా కూడా నిలిచింది. 

'అఖండ' చిత్రంలో బాలకృష్ణ (Nandamuri Balakrishna) డ్యుయల్‌ రోల్‌లో నటించాడు. అఖండ బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఎస్‌ థమన్‌ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ అఖండ విజయంలో కీ రోల్‌ పోషించింది. ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్ లో హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. ఈ ముగ్గురు థంబ్స్ అప్‌ సింబల్‌ చూపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

ఇఫీ (IFFI) చలనచిత్రోత్సవానికి తెలుగు సినిమాలు చాలా ఎంపికైయ్యాయి. మెయిన్ స్ట్రీమ్ సినిమా విభాగంలో 'అఖండ'తో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాజమౌళి  తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్' (RRR) కూడా ఎంపికైంది. దీనితో పాటు అలనాటి అద్భుత తెలుగు కళా ఖండం 'శంకరాభరణం' సినిమా కూడా ఈ సందర్భంగా ఈ వేడుకల్లో ప్రదర్శంచారు.

Read More: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆఫ్ ఇండియా (IFFI)లో ప్రదర్శితం కాబోతున్న 'ఆర్ఆర్ఆర్' (RRR), అఖండ (Akhanda)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!