'అఖండ' (Akhanda) సినిమాకు త్వరలోనే సీక్వెల్ ఉంటుంది.. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కీలక ప్రకటన!

Updated on Nov 28, 2022 10:35 AM IST
గత కొంత కాలంగా 'అఖండ' (Akhanda Sequel) సినిమా సీక్వెల్‌ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించారు బాలకృష్ణ.
గత కొంత కాలంగా 'అఖండ' (Akhanda Sequel) సినిమా సీక్వెల్‌ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించారు బాలకృష్ణ.

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కెరీర్ లో అతిపెద్ద హిట్… 'అఖండ' (Akhanda). గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి బాక్సాఫీస్ వ‌ద్ద రూ.85 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఈ మూవీ 2021లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ రెండో తెలుగు సినిమాగా నిలిచింది.

బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో రూపొందించిన ‘అఖండ’ చిత్రం ధార్మిక, వాణిజ్య అంశాలు కలబోసిన కథాంశంతో ప్రేక్షకుల అభిమానం చూరగొంది. టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో ఒకటి నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయిక. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు అద్భుతమైన విజయాలను నమోదు చేయడమే కాకుండా, బాలయ్య కెరీర్ లోనే మైల్ స్టోన్స్‌గా నిలిచిపోయాయి.

ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా 'అఖండ' (Akhanda Sequel) సినిమా సీక్వెల్‌ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీటిపై స్పందించారు బాలకృష్ణ. ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియాలో(ఇఫీ)లో ఇండియ‌న్ ప‌నోర‌మా కేట‌గిరీలో ఇటీవ‌ల అఖండ సినిమాను స్క్రీనింగ్ జ‌రిగింది. ఈ ప్రీమియ‌ర్‌కు బాల‌కృష్ణ‌తో పాటు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీంద్రరెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అఖండ సీక్వెల్‌ను బాల‌కృష్ణ అనౌన్స్ చేశాడు.

'అఖండ' సినిమాలో బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) అఘోరా పాత్ర‌లో త‌న న‌ట‌న‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు.

“అఖండ-2 (Akhanda 2) తప్పకుండా ఉంటుంది. సబ్జెక్టు కూడా సిద్ధంగా ఉంది. సినిమా అనౌన్స్ చేయడమే లేటు” అంటూ వెల్లడించాడు. అలాగే మోక్షజ్ఞ తప్పకుండా హీరోగా అడుగుపెడతాడు అని హింట్ ఇచ్చారు. “ఎపుడు ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పను. అంతా దైవేచ్ఛ,” అని సమాధానం ఇచ్చారు బాలయ్య. దీని ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఆగిపోయింది అనే వార్తలను తోసిపుచ్చారు బాలయ్య.  

ఇక, 'అఖండ' సినిమాలో బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) అఘోరా పాత్ర‌లో త‌న న‌ట‌న‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించిన ఈ సినిమాలో ప్ర‌గ్యాజైస్వాల్ హీరోయిన్‌గా క‌నిపించింది. ఇక, ప్ర‌స్తుతం బాల‌కృష్ణ 'వీర‌సింహారెడ్డి' (Veerasimha Reddy) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు బాల‌కృష్ణ‌.

Read More: గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో 'అఖండ' (Akhanda) హంగామా.. హాజరైన బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!