Mokshagna Teja : బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ టాప్ హీరో కావాల‌నేది ఫ్యాన్స్ కోరిక‌ట‌

Updated on May 25, 2022 06:37 PM IST
Mokshagna Teja : బాల‌కృష్ణ ఫ్యామిలీ పిక్‌లో మోక్ష‌జ్ఞ ఫోటోలు చూసిన అభిమానులు హీరోగా ఎంట్రీ ఇస్తాడ‌ని ఆశ ప‌డుతున్నారు.
Mokshagna Teja : బాల‌కృష్ణ ఫ్యామిలీ పిక్‌లో మోక్ష‌జ్ఞ ఫోటోలు చూసిన అభిమానులు హీరోగా ఎంట్రీ ఇస్తాడ‌ని ఆశ ప‌డుతున్నారు.

బాల‌కృష్ణ కుమారుడు మోక్ష‌జ్ఞ తేజ (Mokshagna Teja) హీరోగా ఎంట్రీ ఎప్పుడ‌ని నంద‌మూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం మోక్ష‌జ్ఞ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మోక్ష‌జ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందా.. హీరోగా త‌మ‌కు వినోదం పంచుతాడా అనే డౌట్ ఫ్యాన్స్‌లో ఉంది. బాల‌కృష్ణ ఫ్యామిలీ పిక్‌లో మోక్ష‌జ్ఞ ఫోటోలు చూసిన అభిమానులు హీరోగా ఎంట్రీ ఇస్తాడ‌ని ఆశ ప‌డుతున్నారు.

నంద‌మూరి మోక్ష‌జ్ఞ తేజ తండ్రి బాల‌కృష్ణ (Balakrishna), తాత ఎన్టీఆర్ (N. T. Rama Rao)లానే న‌ట‌న రంగంలోకి ఎంట్రీ ఇస్తాడ‌నే వార్త‌లు ఐదారేళ్ల నుంచి వినిపిస్తున్నాయి. కానీ మోక్ష‌జ్ఞ‌ను చూస్తే హీరోగా అయ్యే ఇంట్ర‌స్ట్ లేదేమో అనిపించింది. కానీ ఈ మ‌ధ్య మోక్ష‌జ్ఞ చాలా యాక్టీవ్‌గా క‌నిపిస్తున్నారు. ఇక ఇటీవ‌ల బాల‌కృష్ణ కూడా త‌న వార‌సుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ఆ ప్ర‌క‌ట‌న‌కు మోక్ష‌జ్ఞ లుక్ కూడా ఫ్యాన్స్‌ను సంతోష పెడుతుంది. 

మోక్ష‌జ్ఞ నటించే సినిమాను బాల‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ట‌. బాల‌కృష్ణ చిన్న వ‌య‌సులోనే హీరో అయ్యారు. హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు మోక్ష‌జ్ఞ ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. అందుకే సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. త‌న తండ్రి సినిమా అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్యాన్స్‌కు అందిస్తున్నారు. ఫ్యాన్స్ మోక్ష‌జ్ఞ తేజ్ సినిమాల్లోకి రావాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు. నంద‌మూరి వార‌సుడిగా బాల‌కృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌లా మోక్ష‌జ్ఞ కూడా టాప్ హీరో అవ్వాల‌ని అంటున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!