Balakrishna: బాలయ్యతో ఇంటర్నేషనల్ రేంజ్‌లో ‘రామానుజాచార్య’ మూవీ.. సన్నాహాలు మొదలుపెట్టిన ప్రముఖ నిర్మాత..!

Updated on Dec 09, 2022 03:56 PM IST
త్రిదండి చినజీయర్ స్వామి సహకారంతో బాలకృష్ణ (Balakrishna) మూవీని తెరకెక్కిస్తానని నిర్మాత సి.కల్యాణ్​ తెలిపారు
త్రిదండి చినజీయర్ స్వామి సహకారంతో బాలకృష్ణ (Balakrishna) మూవీని తెరకెక్కిస్తానని నిర్మాత సి.కల్యాణ్​ తెలిపారు

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ‘అఖండ’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశారు. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. మరోవైపు ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోతోనూ ఆయన బిజీబిజీగా ఉన్నారు. ఇదిలాఉంటే ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్​ బాలయ్యతో ఓ ఆధ్యాత్మిక చిత్రాన్ని తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణతో ఇంటర్నేషనల్ రేంజ్‌లో ‘రామానుజాచార్య’ సినిమా (Ramanujacharya Movie)ను నిర్మించబోతున్నానని సి.కల్యాణ్ తెలిపారు. 

‘కల్యాణ్​ అమ్యూజ్‌మెంట్ పార్క్’ ప్రారంభం రోజున బాలయ్య సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు కల్యాణ్​ చెప్పారు. ఒక అంతర్జాతీయ సంస్థ, రవి కొట్టారకరతో కలసి చినజీయర్ స్వామి సహకారంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇంకా పలు ఆసక్తికరమైన విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. 

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో కల్యాణ్​ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ను నిర్మిస్తున్నామని కల్యాణ్​ తెలిపారు. ప్రజలకు కావాల్సిన వినోదం, ఆహారం, సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివన్నీ ఇందులో ఉంటాయని చెప్పారు. దాదాపు రూ.200 కోట్ల ప్రాజెక్ట్ ఇది అని.. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను తాను చేయడం దేవుడిచ్చిన వరంలా భావిస్తున్నానన్నారు. ఇటీవల నిర్మాతలు షూటింగ్స్ ఆపేసి చర్చలు జరపడం పైనా కల్యాణ్​ తనదైన శైలిలో స్పందించారు. 

బాలకృష్ణతో ఇంటర్నేషనల్ రేంజ్‌లో ‘రామానుజాచార్య’ సినిమా (Ramanujacharya Movie)ను నిర్మించబోతున్నానని సి.కల్యాణ్ తెలిపారు. 

‘ఇటీవల చిత్రీకరణలు ఆపేసి.. నిర్మాతలు చర్చించుకోవడమన్నది ఓ ఫ్లాప్‌ షో. దీని వల్ల సమయం, డబ్బు వృథా తప్పితే ఎలాంటి మేలు జరగలేదు. కొందరి వ్యక్తిగత లాభాల కోసం చేసుకున్న బంద్‌ అది. చిన్న సినిమా నిర్మాతల సమస్యలకు ఒక పరిష్కారం లభిస్తుందని దానికి ఓకే చెప్పాం. కానీ తొలి నాలుగు మీటింగుల్లోనే దాని వల్ల ఏం జరగదని అర్థమైపోయింది. కొన్ని లోపాలు, సమస్యలు గుర్తించారు కానీ, వాటి అమలు మాత్రం జరగలేదు. ఫిల్మ్ ఇండస్ట్రీ బతికుందంటే అది కొత్తగా వచ్చే రెండు వందల మంది నిర్మాతల వల్లనే అని భావిస్తా’ అని కల్యాణ్​ పేర్కొన్నారు. 

చిరంజీవి, బాలకృష్ణ సినిమాల నిర్మాతలు ఫిర్యాదు చేయకుండానే ఈ విషయంలో కౌన్సిల్‌ మాట్లాడటం వంద శాతం తప్పని కల్యాణ్​ అన్నారు. ఆ సంగతి వాళ్లకీ చెప్పానని తెలిపారు. కీడు చేసే గుణం ఉన్న వాళ్లు ఎంత పెద్ద హిట్లు కొట్టినా.. చివరికి జీరోలుగానే పరిశ్రమ నుంచి వెళ్లారు తప్ప ఎవరూ హీరోలుగా వెళ్లలేదన్నారు. ఇండస్ట్రీ ఇచ్చిన రూపాయితో నిలబడ్డామని.. ఆ పరిశ్రమకు ఉపయోగపడాలనేదే తన మనవి అని కల్యాణ్​ వివరించారు. 

Read more: Gurthunda Seethakalam: ఆ కారణంతోనే ఈ మూవీ చేశా.. ‘గుర్తుందా శీతాకాలం’ అందరికీ నచ్చుతుంది: సత్యదేవ్ (Satyadev)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!