ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బాలకృష్ణ(Balakrishna) ఫ్యాన్స్‌కు స‌ప్రైజ్

Updated on May 28, 2022 11:31 PM IST
అఖండ త‌ర్వాత మైత్రీ మూవీ మేక‌ర్స్ బాల‌కృష్ణ‌ (Balakrishna) తో ఎన్‌బీకే 107 సినిమా నిర్మిస్తున్నారు.
అఖండ త‌ర్వాత మైత్రీ మూవీ మేక‌ర్స్ బాల‌కృష్ణ‌ (Balakrishna) తో ఎన్‌బీకే 107 సినిమా నిర్మిస్తున్నారు.

ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు బాల‌కృష్ణ (Balakrishna) కొత్త సినిమా పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బాల‌కృష్ణ న‌టిస్తున్న 107 (NBK107) వ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. క‌త్తి ప‌ట్టిన బాల‌కృష్ణ.. మ‌రో మాస్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ  ఈ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

బాల‌కృష్ణ త‌న తండ్రి ఎన్టీఆర్ శ‌త జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఇక బాల‌కృష్ణ అభిమానుల కోసం రిలీజ్ చేసిన‌ 107వ (NBK107) సినిమా పోస్ట‌ర్ వైర‌ల్ అయింది. బాల‌కృష్ణ ఉగ్ర‌రూపంలో క‌నిపించారు. రాయలసీమ ఫ్యాక్ష‌నిజం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాస‌న్ బాల‌కృష్ణ‌కు జోడిగా న‌టిస్తుంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అఖండ త‌ర్వాత మైత్రీ మూవీ మేక‌ర్స్ బాల‌కృష్ణ‌తో ఎన్‌బీకే 107 సినిమా నిర్మిస్తున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!