Veerasimhareddy: 'వీర సింహారెడ్డి' నుంచి ‘సుగుణ సుందరి’ని (Suguna Sundari) అంటూ వచ్చేస్తున్న నందమూరి బాలకృష్ణ!
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'వీర సింహారెడ్డి' (Veerasimhareddy). గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ (Shruthi Haasan) కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది.
‘వీర సింహారెడ్డి’ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇక, ‘వీర సింహారెడ్డి’ (Veerasimhareddy) సినిమా మీద ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను బీ, సీ సెంటర్ల ప్రేక్షకుల కోసమే తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. బాలయ్య లుక్, గెటప్, డైలాగ్స్ ఇలా అన్నీ కూడా మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలానే ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘జై బాలయ్య’ మాస్ ఆంథెమ్ సాంగ్ మూవీ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతుంది. గోపీచంద్ మలినేని (Gopichandh Malineni) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి మరో సాంగ్ అప్‌డేట్ అందించారు మేకర్స్. రెండో సాంగ్ ‘సుగుణ సుందరి’ని (Suguna Sundari) డిసెంబర్ 15న లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు బాలయ్య, శృతి హాసన్ కలిసి ఉన్న రొమాంటిక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్.