రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) ట్రైలర్.. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ సూపర్!

Updated on Oct 31, 2022 01:38 PM IST
‘ఊర్వశివో రాక్షసివో’.. ట్రైలర్ (Urvasivo Rakshasivo Trailer) లో శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తోంది.
‘ఊర్వశివో రాక్షసివో’.. ట్రైలర్ (Urvasivo Rakshasivo Trailer) లో శిరీష్, అను ఇమ్మాన్యూల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ (Allu Sirish), మలయాళీ ముద్దుగుమ్మ అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo). రాకేశ్‌ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాదే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల రిలీజ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నవంబర్‌ 4న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తున్నారు. 

ఇక, ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం నిన్న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రిలీజ్ ట్రైలర్‌ను (Urvasivo Rakshasivo Trailer) ఆవిష్కరించారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా అనిపించడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచేసింది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. అనూప్‌రూబెన్స్, అచ్చు రాజమణి బాణీలు అందించారు.

‘ఊర్వశివో రాక్షసివో’.. ట్రైలర్ (Urvasivo Rakshasivo Trailer) లో శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో డైలాగ్స్ యూత్ ను ఆకట్టుకుంటాయి. “ఇన్ని EMIలు ఉన్నోడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా”, “అయినా లైసెన్స్ లేకుండా బండి నడపడం తప్పు రాజా, ఈ రోజుల్లో లైసెన్స్ లు ఆర్.సి లు ఎవరు అడుగుతున్నారు సర్ హెల్మెట్ ఉంటె చాలు” లాంటి డైలాగ్స్ యూత్ కి కనెక్ట్ అవుతున్నాయి. ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు రొమాంటిక్ ఫీల్ తో యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. 

అమ్మాయిలకు ఆమడ దూరంగా ఉండే అబ్బాయి… అనుకోకుండా ఓ అల్ట్రామోడ్రన్ అమ్మాయితో ప్రేమలో పడడం.. రిలేషన్ స్టార్ట్ చేయడం.. అబ్బాయి ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే అమ్మాయి లైట్ తీసుకోవడం. చివరకి వాళ్ల రిలేషన్ ఎక్కడివరకు వెళ్లిందనే ఆసక్తికర అంశాలతో సినిమా రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కెరీర్, లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లైఫ్‌లో ఓ క్లారిటీ లేకపోవడం.. ఇలా నేటి యువత ఎదుర్కొనే పలు సమస్యలను, వాటికి పరిష్కారాలను ఈ సినిమాలో చూపించనున్నారు. 

‘తను కొరియన్‌ వెబ్‌ సిరీస్‌లా ట్రెండీగా ఉంటే.. నువ్వేంట్రా కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్కలాగా పేజీలు పేజీలు డైలాగ్స్‌ చెబుతున్నావ్‌’ అంటూ వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) డైలాగ్స్ అలరిస్తున్నాయి. ట్రైలర్‌ మొత్తం ఫన్‌తో పాటు ఎంటర్‌టైనింగ్‌ ఉంది. ‘నేనిక్కడ నానా పటేకర్‌ రేంజ్‌లో పర్ఫామెన్స్‌ చేస్తుంటే.. నువ్వు కనీసం ఈటీవి ప్రభాకర్‌లా క్యాచ్‌ చేయలేకపోతున్నావ్‌’ అంటూ సునీల్‌ చెప్పే డైలాగ్స్ నవ్వులూ పూయిస్తున్నాయి. ట్రైలర్‌తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి.

Read More: నిత్యామీనన్ (Nithya Menen) తల్లి కాబోతోందా.. ప్రెగ్నెన్సీ కిట్ పోస్ట్ చేసిన బ్యూటీ.. షాక్ లో ఫ్యాన్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!