'వీర సింహారెడ్డి' (veerasimhareddy) నుంచి 'జై బాలయ్య మాస్ ఆంథెమ్' (Jai Balayya Mass Anthem) రిలీజ్..!

Updated on Nov 25, 2022 12:18 PM IST
తాజాగా 'వీర సింహారెడ్డి' (Veerasimhareddy) మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ 'జై బాలయ్య' మాస్ ఆంథెమ్‌ సాంగ్‌ను విడుదల చేశారు.
తాజాగా 'వీర సింహారెడ్డి' (Veerasimhareddy) మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ 'జై బాలయ్య' మాస్ ఆంథెమ్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'వీర సింహారెడ్డి' (veerasimhareddy). గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్ (Shruthi Haasan) కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఈ సినిమాలో క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ విల‌న్‌గా న‌టిస్తుండగా.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర పోషిస్తోంది.

తాజాగా 'వీర సింహారెడ్డి' (Veerasimhareddy) మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ 'జై బాలయ్య' మాస్ ఆంథెమ్‌ సాంగ్‌ను విడుదల చేశారు. అభిమానుల్లో జోష్ నింపేలా ఉన్న ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. ఖరీముల్లా పాడారు. ‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు’ అంటూ సాగే ఈ పాటలో మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్‌, వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో బాలకృష్ణ లుక్‌ అదిరిపోయింది. 

ఇక, ఈ పాటలో స్టైలిష్‌ గాగుల్స్‌తో ఆయన వేసిన స్టెప్పులు అభిమానులకు కనులవిందుగా అనిపించాయి. బాల‌కృష్ణ క్యారెక్ట‌రైజేష‌న్‌ను చాటిచెబుతూ ప‌వ‌ర్‌ఫుల్ లిరిక్స్‌తో ఈ పాట సాగింది. బాల‌కృష్ణ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని మాస్ ట్యూన్స్‌తో ఈ పాట‌ను కంపోజ్ చేశారు సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌. 

రాయ‌లసీమ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగిన వాస్తవ అంశాల నేప‌థ్యంలోపక్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో బాల‌కృష్ణ (Nandamuri Balakrishna) డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. సాల్ట్ పెప్ప‌ర్ తో పాటు స్టైలిష్ లుక్‌లో బాల‌కృష్ణ క‌నిపించనున్నట్లు తెలుస్తోంది.  

Read More: టాలీవుడ్ లో సరికొత్త కాంబో.. 'సర్కారువారి పాట'(Sarkaruvaari Paata) డైరెక్టర్ తో బాల‌కృష్ణ (Balakrishna)సినిమా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!