‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), అనన్యా పాండే.. ఆసక్తిగా ప్రోమో

Updated on Jul 26, 2022 05:02 PM IST
కాఫీ విత్ కరణ్‌ షోలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda),   అనన్య పాండే,  కరణ్‌ జోహార్
కాఫీ విత్ కరణ్‌ షోలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), అనన్య పాండే, కరణ్‌ జోహార్

యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘లైగర్‌‌’ సినిమా త్వరలో పాన్‌ ఇండియా లెవెల్‌లో విడుదల కాబోతోంది. అనన్యా పాండే హీరోయిన్‌గా నటించారు.

లైగర్‌‌ సినిమా ప్రచారంలో భాగంగా విజయ్, అనన్య.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘కాఫీ విత్ కరణ్’ షోకు హాజరయ్యారు. త్వరలో స్ట్రీమింగ్‌ కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. షోలో విజయ్, అనన్యను బోల్డ్ ప్రశ్నలు అడుగుతూ కరణ్‌.. ఇద్దరినీ బాగానే ఇబ్బంది పెట్టినట్టు ప్రోమోలో తెలుస్తోంది.

ప్రోమో స్టార్టింగ్‌లోనే ‘నీకు చీజ్‌ ఇష్టమేనా?’ అని కరణ్‌ జోహార్‌ అడిగిన ప్రశ్నకు ‘ఇదెక్కడి వరకు వెళుతుందోనని భయమేస్తుంది’ అని సమాధానం చెప్పారు విజయ్‌ దేవరకొండ. ఈ సందర్భంగా జాన్వీకపూర్‌, -సారా అలీఖాన్‌ విజయ్‌ గురించి తన షోలో గతంలో మాట్లాడిన వీడియోను ప్లే చేశారు కరణ్.

కాఫీ విత్ కరణ్‌ షోలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda),   అనన్య పాండే,  కరణ్‌ జోహార్

ఏం జరుగుతోంది?

‘నీకూ ఆదిత్యరాయ్‌కపూర్‌కు మధ్య ఏం జరుగుతోంది’ అని అనన్యను ప్రశ్నించారు కరణ్‌. ఆమె ఏమీ మాట్లాడలేదు. ‘లాస్ట్‌ టైమ్‌ సెక్స్‌ ఎప్పుడు చేశారు’ అని విజయ్‌ను కరణ్‌ అడిగారు. ఈ క్వశ్చన్‌ను కేన్సిల్ చేయండి అంటూ విజయ్‌.. కరణ్‌ను ఒకటికి రెండుసార్లు అడుగుతున్నారు. అనన్య మధ్యలో మాట్లాడుతూ.. నేను చెప్పనా.. ఈ రోజు ఉదయం అని చెప్పారు. దాంతో వెంటనే మొదటిసారి ఈరోజు ఉదయమా అంటూ కరణ్‌ దానిని కొనసాగించారు.

బోల్డ్‌ క్వశ్చన్స్‌తో కరణ్‌.. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) మరియు అనన్యను ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తున్న ‘కాఫీ విత్ కరణ్‌’ షో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రోమో చూస్తుంటే ఈ షో మొత్తం హాట్‌ హాట్‌గానే సాగినట్టుగా అనిపిస్తోంది.

Read More : విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో (Vijay Deverakonda) డేటింగ్‌కి సై అంటున్న బాలీవుడ్‌ భామలు.. రౌడీ హీరో రిప్లై వైరల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!