రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించిన ఆసక్తికర విషయాలు.. మీ కోసం ప్రత్యేకం
సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసే స్టేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన ఖుషి, జనగణమన సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన 'లైగర్' సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు ప్రత్యేకంగా మీ కోసం..
పుట్టి.. పెరిగింది..
1989, మే 9వ తేదీన తెలంగాణలోని హైదరాబాద్‌లో జన్మించారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). 10వ తరగతి వరకు పుట్టపర్తిలోని సత్యసాయి స్కూల్‌లో చదివారు విజయ్. విజయ్ తండ్రి గోవర్ధన్ రావు టీవీల్లో సీరియల్స్‌కు దర్శకత్వం వహించేవారు. వాటిలో సక్సెస్ రాకపోవడంతో ఆ ఫీల్డ్‌ను వదిలేశారు.
2011లో ఫ్రెండ్ క్యారెక్టర్లతో..
2011లో సినీ కెరీర్ ప్రారంభించారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). నాని హీరోగా తెరకెక్కిన ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన విజయ్.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమాలో నటనతో ‘పెళ్లి చూపులు’ సినిమాలో హీరోగా అవకాశం అందుకున్నారు. ఆ సినిమా హిట్ కావడంతో విజయ్‌కు స్టార్ డమ్ వచ్చింది.
అర్జున్‌రెడ్డి సినిమాతో..
'పెళ్లిచూపులు' సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ (Vijay Deverakonda) కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి (Arjun Reddy). ఈ సినిమాలో విజయ్ నటనకు యువత ఖుషీ అయ్యారు. సినిమాలో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, డైలాగ్స్, యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సినిమా నుంచే విజయ్‌కు 'రౌడీ బాయ్' అనే నిక్ నేమ్ వచ్చింది.
గీతా గోవిందం వరకు..
'అర్జున్‌రెడ్డి' సినిమా తెచ్చిన క్రేజ్‌తో వరుస సినిమా ఆఫర్లు వచ్చినా ఆచితూచి అడుగులేశారు విజయ్. ఇక హీరో క్యారెక్టర్లు మాత్రమే చేయాలని అనుకోలేదు. సావిత్రి బయోపిక్‌గా వచ్చిన 'మహానటి' సినిమాలో కీలకపాత్రలో నటించారు విజయ్. ఆ తర్వాత వచ్చిన 'గీత గోవిందం' సినిమాతో మంచి హిట్‌ను అందుకుని తనకు హీరోగా నిలదొక్కుకునే స్టామినా ఉందని నిరూపించుకున్నారు.
కొంత నిరాశే..
గీత గోవిందం తర్వాత విజయ్ (Vijay Deverakonda) నటించిన నోటా, టాక్సీవాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి చేయలేకపోయాయి. అయితే ఆ తర్వాత వచ్చిన 'డియర్' కామ్రేడ్ సినిమా విజయ్ దేవరకొండకు మంచి పేరే తెచ్చిందని చెప్పుకోవాలి. అనంతరం నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తూ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటించారు విజయ్. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ టాక్‌నే సొంతం చేసుకుంది.
పూరీతో లైగర్..
తాను నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, యూత్‌లో విజయ్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ క్రమంలోనే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో సినిమా చేయడానికి కమిట్ అయ్యారు విజయ్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాలో నటించారు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'లైగర్' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతోంది 'లైగర్' సినిమా.
లైగర్ కోసం..
'లైగర్' సినిమా కోసం విజయ్ దాదాపుగా రెండు సంవత్సరాలు కేటాయించారు .కష్టపడి బాడీ బిల్డ్ చేశారు. సినిమాలో బాక్సర్‌గా కనిపించడానికి అవసరమైన శిక్షణను కూడా తీసుకున్న ఈ 'రౌడీ బాయ్'.. లైగర్ సినిమా కోసం చాలా రిస్క్ తీసుకున్నాడని ఇండస్ట్రీ టాక్.
ఇప్పుడు సమంతతో..
'లైగర్' సినిమా విడుదలకు రెడీ కావడంతో.. తన తర్వాతి సినిమాలను లైన్‌లో పెట్టారు విజయ్ (Vijay Deverakonda). ప్రస్తుతం సమంతతో ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఇటీవలే కాశ్మీర్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్.
మరోసారి జగన్‌తో..
ఇప్పటికే పూరీ జగన్నాథ్‌తో 'లైగర్' సినిమా చేశారు విజయ్ (Vijay Deverakonda). ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే పూరీ డైరెక్షన్‌లో ‘జనగణమన’ సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత పూరీ డైరెక్షన్‌లో మరో సినిమా చేయడానికి కూడా ఈ రౌడీ బాయ్ ఓకే చెప్పారని ఇండస్ట్రీ టాక్.
డేటింగ్ కోసం రెడీ అవుతున్న బాలీవుడ్ భామలు
ఈ రౌడీ బాయ్‌కు క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. విజయ్ తమ అభిమాన హీరో అని చాలామంది అమ్మాయిలు చెబుతుంటారు. ఆయనతో సెల్ఫీ దిగాలని కోరుకుంటూ ఉంటారు. ఇటీవలే ఓ అమ్మాయి విజయ్ బొమ్మను తన వీపుపై టాటూ కూడా వేయించుకొని, అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే జాన్వి కపూర్, సారా అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ నటీమణులు విజయ్ దేవరకొండ పక్కన నటించాలని, ఆయనతో డేటింగ్ చేయాలని ఉందని స్టేట్ మెంట్లు కూడా ఇచ్చేశారు. దీనిని బట్టి విజయ్ దేవరకొండకు (Vijay Deverakonda) ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది కదా.
Read More : Mahesh Babu Top Ten Movies: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు టాప్ 10 సినిమాలు.. ప్రత్యేకంగా మీకోసం