విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో (Vijay Deverakonda) డేటింగ్‌కి సై అంటున్న బాలీవుడ్‌ భామలు.. రౌడీ హీరో రిప్లై వైరల్ !

Updated on Jul 13, 2022 05:31 PM IST
జాన్వీ కపూర్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), సారా అలీ ఖాన్
జాన్వీ కపూర్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), సారా అలీ ఖాన్

అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌నే కాదు.. బాలీవుడ్‌నీ షేక్ చేశాడు రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda). ఆ దెబ్బతో విజ‌య్‌కి బాలీవుడ్‌లోనూ బాగా క్రేజ్ పెరిగిపోయింది. తాజాగా స్టార్‌ కిడ్స్, యంగ్‌ హీరోయిన్లు విజయ్ కోసం పోటీ పడుతుండటం విశేషం.  విజయ్‌ దేవరకొండకి `అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం`తో విపరీతమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది.

తాజాగా చూస్తుంటే అమ్మాయిలే కాదు, స్టార్‌ హీరోయిన్లు కూడా విజ‌య్ అంటే ఇష్టప‌డుతున్నార‌ని తెలుస్తోంది. బాలీవుడ్‌ హీరోయిన్లు సారా అలీ ఖాన్‌, జాన్వీ కపూర్‌ 'కాఫీ విత్ క‌ర‌ణ్' షోలో  విజయ్‌ దేవరకొండ అంటే త‌మ‌కు క్రష్ అని బాహాటంగానే చెప్పేశారు. అంతేకాదు ఈ భామ‌లకు రౌడీ హీరోతో డేటింగ్‌కి కూడా వెళ్లాల‌నుంద‌ట‌.

బాలీవుడ్‌ సామాజిక మాధ్యమాల్లో అత్యంత క్రేజ్‌ ఉన్న హీరోయిన్లు జాన్వీ కపూర్‌, సారా అలీ ఖాన్. ఒకరు అతిలోక సుందరి శ్రీదేవి తనయ కాగా, మరొకరు సైఫ్‌ అలీ ఖాన్ ముద్దుల కూతురు. ఈ యంగ్‌ సెన్సేషన్‌ టాలెంట్స్ సోషల్‌ మీడియాలోకి అడుగుపెట్టారంటే, షేక్‌ అయిపోవాల్సిందే. వారి గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తుంటాయి. లక్షలాది నెటిజన్లు వారి ఫోటోల కోసం ఎగబడుతుంటారు.

కరణ్‌ జోహార్‌‌తో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్

షాకింగ్‌ కామెంట్స్..

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇరవై మిలియన్స్‌కి పైగా ఫాలోవర్స్ ఉన్న ఈ యంగ్‌ సెన్సేషన్స్, తాజాగా బాలీవుడ్ మేకర్ కరణ్‌ జోహార్ ఫేమస్‌ టాక్‌ షో `కాఫీ విత్‌ కరణ్‌`లో పాల్గొన్నారు. వీరిద్దరూ కలిసి పాల్గొన్న ఎపిసోడ్‌ ప్రోమో ఇటీవలే విడుదలైంది. ఇందులో వీరిద్దరూ ఒక షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. ఇద్దరూ విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) అంటే త‌మ‌కు క్రష్ అని చెప్పుకొచ్చారు.

ఇందులో కరణ్‌ జోహార్‌ కొత్త పద్దతిలో ఆహ్వానం పలికారు. సారా అలీ ఖాన్‌ స్టయిల్‌లో `నమస్తే దర్శకోన్‌` అని జాన్వీ, సారా అలీ ఖాన్‌లను ఆహ్వానించారు. సారా అలీ ఖాన్‌ తన ఇన్ స్టాగ్రామ్‌లో అభిమానులను దర్శకన్‌ అని పిలుస్తుంటుంది. అదే పదంతో కరణ్‌ వారిని ఆహ్వానించడం విశేషం.

మొదటిసారి వీరిద్దరి మధ్య స్నేహం ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఎలా స్టార్ట్ అయ్యిందని ప్రశ్నించారు కరణ్‌. దీనికి స్పందించిన జాన్వీ కపూర్.. `మీరు అసభ్యకరమైన కోణాలను బయటకు తీస్తారని చాలా మంది చెప్పారు. కానీ ఇది అలా లేదనే' కోణంలో జాన్వీ సమాధానం చెప్పింది.

ఎవరితో డేటింగ్ అంటే..

'నెక్ట్స్ ఎవరితో డేటింగ్‌ చేయాలని అనుకుంటున్నావ్‌' అని సారా అలీ ఖాన్‌ని ప్రశ్నించాడు కరణ్‌. దీనికి ఆమె వెంటనే సమాధానం చెప్పలేకపోయింది. కొంత గ్యాప్‌ తర్వాత సారా అలీ ఖాన్.. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) పేరు చెప్పింది. ఇది విన్న జాన్వీ కపూర్‌ షాక్‌కి గురయ్యింది. అది గమనించిన సారా 'ఓహ్‌.. `నువ్వు కూడా అతన్ని ఇష్టపడుతున్నావా` అని ప్రశ్నించడం హైలైట్‌గా నిలిచింది.

జాన్వీ కపూర్‌.. విజయ్ దేవరకొండపై తన క్రష్‌ని చాలా రోజుల క్రితమే వెల్లడించింది. ఆయనతో కలిసి జాన్వికి `లైగర్‌`లో కలిసి నటించే అవకాశం కూడా వచ్చింది. కానీ డేట్స్ కారణంగా వదులుకుంది.  మరోవైపు తనతో ఎలాంటి సంబంధం లేని సారా అలీ ఖాన్ కూడా.. విజయ్‌ దేవరకొండపై ప్రేమని వ్యక్తం చేయడం విశేషం. వీరి ఎపిసోడ్‌ జూలై 14న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ట్రెండింగ్‌లో ప్రోమో..

జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్‌.. వీరిద్దరూ విజయ్‌ దేవరకొండ కోసం పోటీ పడడం ఆద్యంతం ఆసక్తికరంగా మారడంతోపాటు, ఆ వీడియో బాగా వైరల్‌ అయ్యింది. అలాగే ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ ట్రెండ్‌ అవుతోంది. ఈ ఇద్దరు స్టార్‌ కిడ్స్ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

కరణ్‌ జోహార్‌‌తో విజయ్ దేవరకొండ

ఆమె కోసమే: విజయ్

కాగా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా సారా కామెంట్స్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించాడు. 'విజ‌య్ దేవ‌ర‌కొండ' అంటూ సారా నా పేరు ప‌లికిన తీరు నాకు బాగా న‌చ్చింది. నా ప్రేమ‌, కౌగిలింత‌లు మీ కోస‌మే' అంటూ విజ‌య్‌ త‌న ఇన్‌స్టా స్టేట‌స్‌లో షేర్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల‌య్యింది. విజయ్‌ దేవరకొండ బాలీవుడ్‌లోకి తొలిసారిగా ఎంట్రీ ఇస్తూ `లైగర్‌` చిత్రంలో నటించారు.

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఛార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మించారు. ఆగస్ట్ 25న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియన్‌ మూవీగా విడుదల చేయబోతున్నారు. ఇందులో అనన్య పాండే కథానాయిక. ఈ ఇద్దరు కూడా `కాఫీ విత్‌ కరణ్‌` షోలో పాల్గొన్నారు. ఇక రాబోయే ఎపిసోడ్‌లో విజ‌య్‌ దేవరకొండ (Vijay Deverakonda), అన‌న్య క‌ర‌ణ్ ఇదే షోలో సంద‌డి చేయ‌నున్నారు.

Read More : రాజమౌళి సినిమా కోసం సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) రెమ్యునరేషన్‌ అన్ని కోట్లా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!