Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ‘లైగర్‌’ సినిమా శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌ ధర ఎంతంటే?

Updated on Jul 25, 2022 02:14 PM IST
పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  లైగర్‌‌ సినిమా పోస్టర్
పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్‌‌ సినిమా పోస్టర్

టాలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ముందు వరుసలో ఉంటుంది విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ‘లైగర్’ సినిమా. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో జోరు పెంచింది చిత్ర యూనిట్. ఇటీవల రిలీజ్‌ చేసిన ‘లైగర్‌’ ట్రైలర్‌కు మంచి క్రేజ్ వచ్చింది. డైలాగ్స్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

విజయ్‌ – పూరీ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ట్రైలర్‌ విడుదలైన తర్వాత ‘లైగర్‘ సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ అయ్యింది. మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ప్రేక్షకులు, విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  లైగర్‌‌ సినిమా పోస్టర్

ఇండస్ట్రీ టాక్..

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్‌ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కిన ‘లైగర్‌’ చిత్రానికి వచ్చిన క్రేజ్‌ దృష్ట్యా శాటిలైట్‌, డిజిటల్‌ రైట్స్‌‌కు భారీ డీల్‌ కుదిరినట్లు సమాచారం ఈ సినిమా. శాటిలైట్‌, డిజిటల్ రైట్స్ కలిపి మొత్తంగా రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్లు వరకు వచ్చినట్టు ఇండస్ట్రీ టాక్.

బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మించిన ‘లైగర్‘ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు అనన్య. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. బాక్సింగ్‌ ఛాంపియన్‌  మైక్ టైసన్ గెస్ట్‌ రోల్‌లో అలరించబోతున్నారు.

Read More : ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ (RaviTeja) స్టెప్స్‌.. వీడియో వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!