Upasana: ఉపాస‌న పుట్టిన‌ రోజున స‌ర్‌ప్రైజ్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌ (Ram Charan)!.. స్పెష‌ల్ ట్వీట్ పోస్టు చేసిన మామ‌గారు

Updated on Jul 21, 2022 07:03 PM IST
Upasana: ప్రియ‌మైన ఉపాస‌న‌కు పుట్టిన‌ రోజు శుభాకాంక్ష‌లంటూ రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు ఉపాస‌న థ్యాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు
Upasana: ప్రియ‌మైన ఉపాస‌న‌కు పుట్టిన‌ రోజు శుభాకాంక్ష‌లంటూ రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు ఉపాస‌న థ్యాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు

ఉపాస‌న (Upasana) అపోలో వార‌సురాలుగానే కాకుండా.. మెగా ఇంటి కోడ‌లిగా మంచి పేరు సంపాదించుకున్నారు. జూలై 20న ఉపాస‌న పుట్టిన రోజు. ఉపాస‌న త‌న 33 వ పుట్టిన రోజును జ‌రుపుకున్నారు. ఉపాస‌నకు త‌న భ‌ర్త రామ్ చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఓ పోస్టు కూడా పెట్టారు. ప్రియ‌మైన ఉపాస‌న‌కు పుట్టిన‌ రోజు శుభాకాంక్ష‌లంటూ రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు ఉపాస‌న థ్యాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు. 

రామ్ ప్రేమ గొప్ప‌ది - ఉపాస‌న‌
ఉపాస‌న (Upasana) బ‌ర్త్ డే రోజున కేక్ క‌ట్ చేస్తున్న ఫోటోల‌ను త‌న‌ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) త‌న‌ను ఎప్పుడూ స‌ర్ ప్రైజ్ చేస్తుంటార‌ని ఉపాస‌న తెలిపారు. రామ్ చ‌ర‌ణ్ ప్రేమ‌తో త‌న‌ను సంతోష పెడుతుంటార‌న్నారు.

కోడ‌లికి చిరు ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా కోడ‌లు పుట్టిన రోజు సంద‌ర్భంగా విష్ చేశారు. త‌న ట్విట్ట‌ర్‌లో 'మా ఇంటి కోడలు పిల్ల ఉపాస‌న కొణిద‌ల‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు' అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఉపాసన (Upasana) వైద్య రంగంలో  ఎన్నో విజ‌యాల‌ను సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు. 'అపోలో చారిటీ ఫౌండేషన్' వైస్ చైర్మన్‌గా కీలక బాధ్యతలను నిర్వ‌ర్తిస్తున్నారు. ప‌లు సేవా కార్యక్రమాలు నిర్వ‌హిస్తూ మెగా కోడలుగా ఉపాస‌న..  అంద‌రి ప్రశంసలు అందుకుంటున్నారు. 

Read More: డ్రైవ‌ర్ బ‌ర్త్ ‌డే కోసం.. సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన రామ్ చరణ్ (Ram Charan), ఉపాస‌న‌ దంపతులు !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!