మా పెళ్లి బంధానికి ప‌దేళ్లు : ఉపాసన (Upasana) ఎమోష‌న‌ల్ ట్వీట్!

Updated on Jun 14, 2022 08:51 PM IST
రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), ఉపాస‌న (Upasana) ల పెళ్లి 2012 జూన్ 14 న జ‌రిగింది.
రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), ఉపాస‌న (Upasana) ల పెళ్లి 2012 జూన్ 14 న జ‌రిగింది.

హీరో రామ్ చరణ్ (Ram Charan), ఉపాస‌న (Upasana) లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట, ఆ తర్వాత ఆదర్శ దంపతులుగా అనేకసార్లు కితాబునందుకున్నారు. రామ్, ఉపాస‌న‌ల మూడు ముళ్ల బంధానికి ప‌దేళ్లు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా ఉపాస‌న త‌న భ‌ర్త రామ్‌తో క‌లిసి దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. రామ్‌కు ప్రేమ‌తో.. అంటూ పోస్ట్ పెట్టారు. 

రామ్ చ‌ర‌ణ్ (Ram Charan), ఉపాస‌నల పెళ్లి 2012 జూన్ 14 న జ‌రిగింది. అంగ‌రంగ వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చ‌ర‌ణ్, అపోలో అధినేత మ‌నుమ‌రాలు ఉపాస‌న‌ల పెళ్లి వేడుకను దేశం మొత్తం గుర్తుపెట్టుకునేలా జ‌రిపించారు. రామ్ చ‌ర‌ణ్ తండ్రిలానే న‌ట‌న‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఉపాస‌న కూడా అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని చేప‌ట్టారు. 

ముచ్చటైన జంట రామ్ చ‌ర‌ణ్ , ఉపాసన

రామ్, ఉపాస‌న‌లు విదేశాల్లో ఇటీవలే త‌మ మ్యారేజ్ డేను జ‌రుపుకుంటున్నారు. ఉపాస‌న గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్సులో మెరిసిపోయారు. రామ్ చ‌రణ్ కూడా చాలా స్టైలిష్‌గా క‌నిపించారు. 

రామ్, ఉపాస‌న‌ (Upasana) ల ప‌దేళ్ల పెళ్లి బంధం ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా అభిమానులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు.

ప‌లు సేవా కార్య‌క్ర‌మాల్లో రామ్ ఫ్యాన్స్
రామ్, ఉపాస‌న‌ (Upasana) ల ప‌దేళ్ల పెళ్లి బంధం ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా అభిమానులు ప‌లు సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. ల‌క్ష‌ల మందికి అన్న‌దాన ఏర్పాట్లు చేశారు. ర‌క్త‌దానం కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించారు. ప‌లు ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు.  

ఈ ఏడాదిలో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన‌ ఆర్.ఆర్.ఆర్, ఆచార్య సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్ర‌స్తుతం శంక‌ర్ దర్శ‌క‌త్వంలో రామ్ చరణ్.. ఆర్‌సీ 15 లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌కు జోడిగా హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నారు. హాలిడే ట్రిప్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ప‌లు సినిమాల షూటింగ్‌లో బిజీ అవ‌నున్నారు. 

Read More: ఆదర్శప్రాయమైన జంట రామ్ చరణ్ & ఉపాసన .. వీరి విదేశీ టూర్ వెనుక మర్మం ఏమిటి ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!