‘బింబిసార’ (Bimbisara) డైరెక్టర్‌తో భారీ మూవీకి ప్లాన్!.. వశిష్టకు అవకాశం ఇచ్చే యోచనలో చరణ్ (Ram Charan)​?

Updated on Nov 10, 2022 10:32 AM IST
దర్శకుడు వశిష్ట (Mallidi Vasishta)తో చరణ్​ చర్చలు జరుపుతున్నాడని సమాచారం. ఈ కాంబో ఫిక్స్ అయితే క్రేజీ మూవీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు
దర్శకుడు వశిష్ట (Mallidi Vasishta)తో చరణ్​ చర్చలు జరుపుతున్నాడని సమాచారం. ఈ కాంబో ఫిక్స్ అయితే క్రేజీ మూవీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు

‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్​ (Ram Charan). నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయడంతో విదేశాల్లోనూ ఈ చిత్రం మంచి ఆదరణను దక్కించుకుంది. ఈ మూవీ ఇటీవలే జపాన్‌లో రిలీజై అక్కడా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ చిత్రంలో నటిస్తున్న చరణ్​.. ఆ తర్వాత చేసే ప్రాజెక్టుపై ఇంకా స్పష్టత రాలేదు. పాన్ ఇండియా ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. కథల ఎంపికలో ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. 

‘జెర్సీ’ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చరణ్​ చేయాల్సిన చిత్రం సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే ఆగిపోయింది. ఈ విషయాన్ని ఆయన టీమ్ ప్రకటించింది. దీంతో మెగా వారసుడు చేసే తర్వాతి సినిమా ఏంటనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. ఇటీవలే ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో కలసి మూవీ చేసేందుకు చరణ్​ చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వినిపించాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సిద్ధం చేసిన కథను బుచ్చిబాబు వినిపించగా.. కథ నచ్చినప్పటికీ చరణ్​ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. 

మెగా వారసుడు చేసే తర్వాతి సినిమా ఏంటనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది

బుచ్చిబాబు గురువు సుకుమార్‌తో చరణ్​ ఓ సినిమాకు ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌ను ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌కు ముందే చరణ్​‌తో సుకుమార్ తెరకెక్కించారని తెలిసింది. ఈ విషయాన్ని ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ బయటపెట్టారు. అయితే దీనిపై సుకుమార్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలాఉంటే.. చెర్రీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి తాజాగా మరో క్రేజీ వార్త హల్‌చల్ చేస్తోంది. నందమూరి కల్యాణ్​ రామ్ నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’ (Bimbisara) ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఈ సినిమాతో వశిష్ట (Mallidi Vasishta) దర్శకుడిగా పరిచయమయ్యాడు.

డైరెక్ట్ చేసిన తొలి సినిమానే బాగా డీల్ చేశాడని వశిష్టకు మంచి పేరు వచ్చింది. ఈ యంగ్ డైరెక్టర్‌తో ఓ చిత్రం చేసేందుకు చరణ్​ చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఈ మూవీని పెద్ద బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ వ్యయంతో ఈ సినిమాను గ్రాండ్‌గా తెరకెక్కిస్తారని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే పాన్ ఇండియా చిత్రాన్ని తీసే అవకాశాన్ని వశిష్ట దక్కించుకున్నట్లేనని చెప్పాలి.  ఈ మూవీకి సంబంధించి త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.  

Read more: ట్రోలర్స్‌పై మండిపడుతున్న రష్మికా మందన్న(Rashmika Mandanna)..ఇష్టమొచ్చినట్టు రాస్తే ఊరుకోనంటూ వార్నింగ్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!