రజినీకాంత్‌ (Rajinikanth)తో సినిమా చేయనున్న ‘బింబిసార’ డైరెక్టర్! సూపర్‌‌స్టార్ ఓకే చెప్పేనా?

Updated on Oct 20, 2022 04:27 PM IST
సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నారు.
సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నారు.

సూపర్‌‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth).. పరిచయం అక్కర్లేని పేరు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. ఆయన సినిమా విడుదలవుతోందంటే అభిమానులతోపాటు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. రజినీతో సినిమా చేయాలని ఎదురుచూడని డైరెక్టర్ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రజినీని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందంటే ఇక ఆ దర్శకుడి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది.

నందమూరి కల్యాణ్‌రామ్ చాలా రోజులుగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన బింబిసార సినిమాతో హిట్ అందుకున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన బింబిసార సినిమాను కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ఠ్‌ డైరెక్ట్‌ చేశారు. మొదటి సినిమా అయినా తన టాలెంట్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. బింబిసార సినిమా స్క్రీన్‌ప్లే రాసుకున్న విధానం, టేకింగ్, కల్యాణ్‌రామ్‌ను చూపించిన విధానం అన్నీ ప్రేక్షకులను ఫిదా చేశాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన బింబిసార సినిమా సక్సెస్‌తో ఇండస్ట్రీలో వశిష్ఠ పేరు మారుమోగిపోయింది.

ఇప్పుడు మరోసారి వశిష్ఠ్‌ పేరు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. బింబిసార సినిమా తర్వాత దానికి సీక్వెల్‌ తెరకెక్కిస్తారని, దానికి కూడా వశిష్ఠ్‌ దర్శకత్వం వహిస్తారని అందరూ అనుకున్నారు. అయితే, బింబిసార సినిమా తర్వాత హీరో కల్యాణ్‌రామ్ రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వాటిని త్వరగా పూర్తిచేయడానికి రెడీ అయ్యారు కూడా. దీంతో వశిష్ఠ్ తన తర్వాతి సినిమాను ఎవరితో తెరకెక్కించునున్నారనే విషయంపై ఇండస్ట్రీలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.

సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth) ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేస్తున్నారు.

రెండో సినిమాతోనే..

వశిష్ఠ్‌ తన రెండో సినిమాను ఏకంగా సూపర్‌‌స్టార రజినీకాంత్‌తో తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రజినీకి వశిష్ఠ్‌ స్టోరీ లైన్ చెప్పారని టాక్. అయితే రజినీ ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వశిష్ఠ్‌తో సినిమా చేయడానికి రజినీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే ఇక ఆయన ఫేట్ మారినట్టేనని అంటున్నారు చిత్ర ప్రముఖులు.

కాగా, ఎటువంటి అంచనాలు లేకుండా ఆగస్టు 5వ తేదీన విడుదలైన బింబిసార సినిమా సంచలన విజయం సాధించింది. కొత్త దర్శకుడే అయినా వశిష్ఠ్‌ మాత్రం సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసలు దక్కాయి. ఇక, రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజినీ పోలీసాఫీసర్‌‌గా కనిపిస్తున్నారు.   

Read More : రెండు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ (Rajinikanth)! లైకా ప్రొడక్షన్స్‌తో డీల్‌?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!