'టాంజానియా' అడవుల్లో భార్యతో కలిసి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) షికార్లు.. ఫొటోలు, వీడియోలు వైరల్!

Updated on Nov 04, 2022 12:47 PM IST
జపాన్ లో ప్రమోట్ చేయడానికి 'ఆర్ఆర్ఆర్' (RRR) టీమ్ అక్కడికి వెళ్లారు. రామ్ చరణ్ (Ram Charan) తన భార్య ఉపాసనతో వెళ్లారు.
జపాన్ లో ప్రమోట్ చేయడానికి 'ఆర్ఆర్ఆర్' (RRR) టీమ్ అక్కడికి వెళ్లారు. రామ్ చరణ్ (Ram Charan) తన భార్య ఉపాసనతో వెళ్లారు.

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చ‌ర‌ణ్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన‌ ఈ పాన్ ఇండియా సినిమా బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా వ‌సూళ్లను రాబ‌ట్టి రికార్డులు సృష్టించింది. 

'ఆర్ఆర్ఆర్' సినిమాని చూసి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ప్రేక్షకులు, సెలబ్రిటీలు, సినిమా వాళ్ళు అందరూ అభినందించారు. ఈ సినిమాని ఆస్కార్ కి కూడా జనరల్ కేటగిరిలో పంపించింది చిత్ర యూనిట్. ఇక, ఈ సినిమాతో దర్శకుడు రాజమౌళికి మరింత స్టార్ డమ్ వచ్చింది. 

మరోవైపు RRR సినిమా ప్రపంచంలోని చాలా దేశాల్లో విడుదలయిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో మరిన్ని దేశాల్లో కూడా రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జపాన్ లో కూడా RRR సినిమాని ఈ నెల 21న విడుదల చేయబోతున్నారు. 

దీంతో ఈ సినిమాను జపాన్ లో ప్రమోట్ చేయడానికి 'ఆర్ఆర్ఆర్' (RRR) టీమ్ అక్కడికి వెళ్లారు. రామ్ చరణ్ (Ram Charan) తన భార్య ఉపాసనతో (Upasana) వెళ్లగా.. ఎన్టీఆర్ (Jr NTR) తన భార్య ప్రణతి, ఇద్దరు కొడుకులను తీసుకొని జపాన్ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఇదిలా ఉంటే.. ప్రమోషన్స్ కోసం భార్య ఉపాసనతో కలిసి జపాన్ వెళ్లిన చరణ్, అనంతరం సౌతాఫ్రికా కి వెకేషన్ కి వెళ్లారు. అక్కడి నుంచి వాళ్లిద్దరూ ‘టాంజానియా’లో (Tanzania) షికారు చేసి అక్కడ తమకి నచ్చిన ఒక లొకేషన్ లో ఫోటోలు దిగారు. అందులో రెండు బ్యూటిఫుల్ ఫొటోస్ ని, వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు ఉపాసన. ఆ ఫొటోల్లో స్టైలిష్ దుస్తుల్లో చరణ్, ఉపాసన ఇద్దరి లుక్స్ అదిరిపోయాయి. కాగా ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Read More: జపాన్ లో RRR ప్రమోషన్స్, వెకేషన్ పూర్తి చేసుకుని ఇండియాకు చేరుకున్న రామ్ చరణ్ (Ram Charan).. వీడియో వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!