జపాన్ లో RRR ప్రమోషన్స్, వెకేషన్ పూర్తి చేసుకుని ఇండియాకు చేరుకున్న రామ్ చరణ్ (Ram Charan).. వీడియో వైరల్!

Published on Nov 03, 2022 02:50 PM IST

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'RC15'లో  నటిస్తూనే తర్వాతి సినిమా కోసం కథలు వింటున్నాడు. 

ఇదిలా ఉంటే.. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమాకు ఫుల్ ఫిదా అయ్యారు.

ఈ నేపథ్యంలో RRR సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఇతర భాషల్లోకి డబ్ చేసి అక్కడ కూడా విడుదల చేసేందుకు మూవీ యూనిట్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే అక్కడ ప్రమోషన్ల కోసం రామ్ చరణ్ (Ram Charan) సతీసమేతంగా జపాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి రామ్ చరణ్ దంపతులు  ఓ చిన్న వెకేషన్ కి కూడా వెళ్లారు. ఫైనల్ గా ఈ వెకేషన్ ని పూర్తి చేసుకొని ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read More: టాలీవుడ్ హీరోలపై అమెరికన్ నటి రెబెకా గ్రాంట్(RebeccaGrant) ఆసక్తికర ట్వీట్.. ‘తొలి పవర్ స్టార్’ ఎవరంటూ ప్రశ్న?