కల్యాణ్​ రామ్ (Kalyanram Nandamuri) ‘బింబిసార’ (Bimbisara) సీక్వెల్ పై దర్శకుడు మల్లిడి వశిష్ట ఏమన్నారంటే..?

Updated on Oct 28, 2022 10:38 AM IST
కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) ఇప్పటికే కమిట్ అయిన ఇతర ప్రాజెక్టులు పూర్తవడానికి వచ్చే ఏడాది జూలై వరకు సమయం పడుతుంది.
కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) ఇప్పటికే కమిట్ అయిన ఇతర ప్రాజెక్టులు పూర్తవడానికి వచ్చే ఏడాది జూలై వరకు సమయం పడుతుంది.

నందమూరి హీరో కల్యాణ్​ రామ్ (Kalyanram Nandamuri) నటించిన ‘బింబిసార’ (Bimbisara) చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ‘బింబిసార’ బంపర్ హిట్‌ సాధించి కల్యాణ్​ రామ్‌లో సరికొత్త జోష్‌ను నింపింది. రొటీన్ చిత్రాలకు భిన్నంగా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న కథతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 

సొంత బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో కొత్త దర్శకుడ్ని నమ్మి.. ‘బింబిసార’ను (Bimbisara) కల్యాణ్ రామ్ నిర్మించారు. ఒకరకంగా ఇది సాహసమనే చెప్పాలి. కానీ ఆయన కష్టం వృథా పోలేదు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఆగస్ట్‌ 5న ఆడియెన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తిచేసి డబుల్ ప్రాఫిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కెరియర్ కు మంచి జోష్ తీసుకొచ్చింది ఈ సినిమా.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై వశిష్ఠ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బింబిసార’ చిత్రంలో క్యాథరీన్‌ థ్రెసా (Catherine tressa), సంయుక్త మీనన్‌లు (Samyuktha Menon) హీరోయిన్లుగా నటించారు. డ్యుయెల్‌ రోల్‌ చేసిన కల్యాణ్‌ రామ్‌.. బింబిసారుడనే క్రూరమైన రాజు పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. నటుడు ప్రకాష్ రాజ్‌తోపాటు వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి సీనియర్ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణీ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ‘బింబిసార-2’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన దర్శకుడు మల్లిడి వశిష్ట.. 'బింబిసార 2' (Bimbisara 2) సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

నిజానికి ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే 'బింబిసార 2' (Bimbisara 2) ఉంటుందని దర్శక హీరోలు ప్రకటించారు. మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో.. మల్లిడి వశిష్ట ప్రస్తుతం సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ పై పని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన వశిష్ట.. 'బింబిసార 2' సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyanram) ఇప్పటికే కమిట్ అయిన ఇతర ప్రాజెక్టులు పూర్తవడానికి వచ్చే ఏడాది జూలై వరకు సమయం పడుతుంది. దీంతో తమ సినిమా షూటింగ్ ను జూలై తర్వాతే ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ‘బింబిసార’ తొలి భాగం భారీ హిట్ అయినందున తనపై విపరీతమైన ఒత్తిడి ఉందని అన్నారు. 

మల్లిడి వశిష్ట (Mallidi Vasishta) ఇంకా మాట్లాడుతూ.. ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లి ఒక ఫాంటసీ సినిమా చూశారు.. అది క్లిక్ అయింది. సినిమా అంతా వారికి ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు రెండవ భాగం మనం ఏమి ఇస్తున్నామో తెలుసుకోవడానికి వారు ఆసక్తి కనబరుస్తారు. నేను వారికి కొత్తది ఇవ్వాలి.. కాబట్టి నాపై మరింత ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది అంటూ ఆయన వెల్లడించారు.

Read More: Bimbisara: 'బింబిసార' సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ నటనపై అల్లు అర్జున్ (Allu Arjun) కామెంట్లు.. ట్వీట్ వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!