‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie)ను ఫారెన్ ఆడియెన్స్ ఇంతలా ఆదరిస్తారని అనుకోలేదు: దర్శకధీరుడు రాజమౌళి (rajamouli ss)

Updated on Oct 27, 2022 12:55 PM IST
‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) ఇంత పెద్ద హిట్టవుతుందని తాను అనుకోలేదని రాజమౌళి (rajamouli ss) అన్నారు
‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) ఇంత పెద్ద హిట్టవుతుందని తాను అనుకోలేదని రాజమౌళి (rajamouli ss) అన్నారు

దర్శకధీరుడు రాజమౌళి (rajamouli ss) ప్రతి సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. ఒక్కో చిత్రంతో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు. ‘మగధీర’తో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన జక్కన్న.. తన సినిమాలో స్టార్ హీరోలు లేకపోయినా హిట్ కొట్టగలనని ‘ఈగ’తో నిరూపించారు. ఆ తర్వాత ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అనంతరం తీసిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) మూవీతో డైరెక్టర్‌గా పాన్ వరల్డ్ పాపులారిటీని రాజమౌళి సంపాదించారు. 

‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రాజమౌళి కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకోవాలి. ఈ మూవీ దాదాపు రూ.1,200 కోట్లు కలెక్ట్ చేసి.. మన దేశంలో టాప్–3 హయ్యెస్ట్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ గ్రాఫ్ మరింతగా పెరిగింది. జక్కన్న మేకింగ్‌కు విదేశీ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. తారక్, రామ్ చరణ్ యాక్టింగ్ చూసి షాక్ అయ్యారు. నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా పలు వారాల పాటు ఈ మూవీ నంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం. 

‘ఆర్ఆర్ఆర్’ను చూసిన విదేశీ ప్రేక్షకులు రాజమౌళి మేకింగ్‌కు ఫ్యాన్స్ అయిపోయారు. ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటి జక్కన్న గత చిత్రాలు ఏ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయా అని వెతికి మరీ చూస్తుండటమే దీనికి నిదర్శనం. ఇక, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇటీవలే జపాన్‌లో రిలీజైంది. అక్కడ ప్రమోషన్స్ కోసం రాజమౌళి, చరణ్​, ఎన్టీఆర్ కూడా వెళ్లారు. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ఇంత పెద్ద హిట్టవుతుందని తాను అనుకోలేదన్నారు. 

ఆర్ఆర్ఆర్ సినిమాకు అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. మూవీలోని యాక్షన్ సీన్స్ అన్ని భాషల ఆడియెన్స్‌కు కనెక్ట్ కావడానికి బాగా ఉపయోగపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇండియన్స్ ఎక్కడ ఉంటే అక్కడ మా సినిమా బాగా ఆడుతుందని అనుకున్నా. కానీ ఇతర దేశాల ప్రేక్షకులు నుంచి భారీ స్థాయిలో ఆదరణ రావడం ఆరంభమైంది. దీనిని నేను అస్సలు ఊహించలేదు’ అని రాజమౌళి పేర్కొన్నారు.

Read more: రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా మహేష్ బాబు (Mahesh Babu)-రాజమౌళి ప్రాజెక్ట్.. విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!