జపాన్ లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ (RRR) టీమ్ హంగామా మామూలుగా లేదుగా.. పాపులర్ గేమింగ్ స్టూడియోలో రాజమౌళి (SS Rajamouli)!

Updated on Oct 21, 2022 03:52 PM IST
సోషల్‌ మీడియాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) రిలీజ్‌ నాటి హంగామా కనిపిస్తోంది. 3D చిత్రాలను రాజమౌళి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
సోషల్‌ మీడియాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) రిలీజ్‌ నాటి హంగామా కనిపిస్తోంది. 3D చిత్రాలను రాజమౌళి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘ఆర్‌ఆర్ఆర్‌’ (RRR) సినిమా జపాన్ లో ఈ నెల 21న గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్‌ కోసం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (NTR) జపాన్‌లో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్వ్యూలు, ఫ్యాన్‌ మీట్‌ లకు హాజరయి అక్కడి ప్రేక్షకులను అలరించారు. ఈ క్రమంలో వారు ఇంకొన్ని రోజులు వీళ్లు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. సోషల్‌ మీడియాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) రిలీజ్‌ నాటి హంగామా కనిపిస్తోంది. ‘జపాన్‌లో మావోడి క్రేజ్‌ చూశారా’ అంటూ ఫ్యాన్స్‌ ఆ ఫొటోలను రీషేర్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వీడియో గేమ్స్ క్రియేటర్ హిడియో కోజిమాను (HIDEO KOJIMA) కలిశారు. ఈ సందర్భంగా తీసిన 3D చిత్రాలను రాజమౌళి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. 3D చిత్రాలను రూపొందించడానికి ఉపయోగించే బాడీ స్కానర్‌ లో కూర్చుని ఉన్న ఫోటోతో పాటు మరికొన్ని చిత్రాలను షేర్ చేశారు.

“లెజెండరీ వీడియో గేమ్ క్రియేటర్ కొజిమాను కలవడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వీడియో గేమ్స్, సినిమాలతో పాటు మరికొన్ని విషయాల గురించి మాట్లాడాం. ఈ మెమరీస్ ఎప్పటికీ నిలిచిపోయి ఉంటాయి’’ అని రాజమౌళి (SS Rajamouli) ట్వీట్ చేశారు. మరోవైపు రాజమౌళిని కలవడం గురించి కొజిమా కూడా ట్వీట్‌ చేశారు. 

“దర్శకుడు SS రాజమౌళి.. KJPని సందర్శించారు..! మేము అతనిని స్కాన్ చేశాం. రాజమౌళి నుంచి నాకు చాలా బహుమతులు లభించాయి. ఈ డిలైటెడ్ బహుమతులు ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు” అని ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే అక్కడి వీడియో గేమ్స్‌లో రాజమౌళి కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

కాగా, 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో అలియాభట్‌ (Alia Bhatt), అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఒలివియా మోరీస్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. మార్చి 25న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ.1200కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. డీవీవీ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!