తారక్ (Jr NTR) భుజాలపై చరణ్ (Ram Charan).. ఫైట్ కంపోజర్ పేరు బయటపెట్టిన జక్కన్న (rajamouli ss)

Updated on Oct 13, 2022 12:17 PM IST
భారత్, అమెరికాల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) మూవీ జపాన్‌లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది
భారత్, అమెరికాల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) మూవీ జపాన్‌లో గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలియంది కాదు. ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా.. విదేశాల్లోనూ భారతీయ సినిమాల సత్తా ఏంటో చూపించింది. ఇప్పుడు జపాన్‌లో పెద్ద ఎత్తున విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. 

రాజమౌళి టేకింగ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్‌ల అద్భుతమైన నటనతోపాటు ఎంఎం కీరవాణి సంగీతం ‘ఆర్ఆర్ఆర్’ విజయానికి కారణాలుగా చెప్పొచ్చు. అదే సమయంలో సినిమాలోని ఫైట్లు కూడా ప్రేక్షకులను అలరించాయి. ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్ ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. తారక్ భుజాలపై చరణ్ కూర్చుని చేసే ఫైట్.. థియేటర్లలో ఆడియెన్స్‌తో ఈలలు వేయించింది. అలాంటి ఈ యాక్షన్ సీన్‌ను కంపోజ్ చేసిందెవరో బయటపెట్టారు జక్కన్న. 

డ్యాన్స్ మాస్టర్‌తో ఫైట్ సీక్వెన్స్ డిజైన్
తారక్, చరణ్ భుజం ఫైట్ సీక్వెన్స్‌ను ఓ డ్యాన్స్ మాస్టర్ డిజైన్ చేయడం విశేషం. ‘నాటు నాటు’ పాటను కొరియోగ్రఫీ చేసిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్‌యే.. షోల్డర్ ఫైట్‌నూ డిజైన్ చేశారట. ఈ విషయాన్ని రాజమౌళి రివీల్ చేశారు. ప్రేమ్ రక్షిత్‌తో పని చేయడం తనకు చాలా ఇష్టమని ఆయన చెప్పారు. 

ప్రేమ్ రక్షిత్‌తో పని చేయడం తనకు చాలా ఇష్టమని రాజమౌళి అన్నారు

ప్రేమ్‌తో పని చేయడం ఇష్టం
‘ప్రేమ్ రక్షిత్‌తో పని చేయడం నాకు ఇష్టం. నాతో సినిమా చేసేటప్పుడు ప్రేమ్ ఇతర ప్రాజెక్టులకు పనిచేయరు. ‘నాటు నాటు’ స్టెప్స్ కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన అసిస్టెంట్స్ కూడా బాగా శ్రమించారు. ఆ స్టెప్స్ రిహార్సల్స్ చేస్తున్నప్పుడు వారందరూ కాళ్ల నొప్పులతో తట్టుకోలేకపోయారు. అయినా వాళ్లు ఆ నొప్పిని భరించి మంచి డ్యాన్స్ మూవ్స్ ఇచ్చారు’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో మూవీ మారథాన్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్, బాహుబలి, ఈగ చిత్రాలను ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌లో జక్కన్న కూడా పాల్గొన్నారు. సినిమా ప్రదర్శన అనంతరం ఈవెంట్ మేనేజ్‌మెంట్ ‘క్యూ అండ్ ఏ’ సెషన్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన విశేషాలను అందరికీతో పంచుకున్నారు. ‘నాటునాటు’ పాటకు స్టెప్స్ డిజైనింగ్, షోల్డర్ ఫైట్ సీక్వెన్స్‌తోపాటు సినిమాలోని మరిన్ని విశేషాల గురించి ఆయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.  

Read more: జపాన్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఆర్ఆర్ఆర్ (RRR Movie).. ప్రమోషన్స్‌కు వెళ్లనున్న జక్కన్న అండ్ కో?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!