'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా ఆస్కార్ కు నామినేట్ కాకపోవడంపై రష్మిక మందన్నా (Rashmika Mandanna) కీలక వ్యాఖ్యలు..!
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) కలిసి నటించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR). ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు పలు రికార్డులను సృష్టించింది. అంతేకాకుండా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది. ఇక ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR Oscar Nominations) సినిమా ఆస్కార్ కు నామినేట్ కాకపోవడం పట్ల ఇప్పటికే మెగా అభిమానులు, నందమూరి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ అంశం పట్ల కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇదే విషయంపై పాన్ ఇండియా హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన (Rashmika Mandanna) స్పందించింది.
రష్మిక మందన ప్రస్తుతం హిందీలో ఆమె తాజాగా నటించిన 'గుడ్ బై' (Good Bye) సినిమాలో నటించింది. ఈ చిత్రానికి డైరెక్టర్ వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో రష్మిక ప్రమోషన్లలో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ అవార్డుకు నామినేట్ కాకపోయినా పోయేదేం లేదని అభిప్రాయపడింది. 'ఈ సినిమాకు ప్రజల నుంచి లభించిన ప్రేమే అన్నింటికన్నా పెద్ద అవార్డ్ లాంటిది. ఎలాంటి భేదాలు లేకుండా ఆ సినిమా సక్సెస్ ను మనమందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది సంతోషించాల్సిన విషయం' అని పేర్కొంది రష్మిక.
"గతంలో నేను నటించిన 'డియర్ కామ్రేడ్' (Dear Comrade) చిత్రం కూడా ఆస్కార్ నామినేషన్ కోసం పరిశీలనకు వెళ్లింది. కాకపోతే ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లలేదు. కానీ 'ఆర్ఆర్ఆర్' అలా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఈ మూవీపై అభిమానాన్ని చూపించారు. ఈ సినిమాకు భారీగా వసూళ్లు రావడమే కాకుండా ప్రేకక్షులను మెప్పించింది. ఈ విషయాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి" అంటూ రష్మిక (Rashmika Mandanna) చెప్పుకొచ్చింది.