'ఆర్ఆర్ఆర్' (RRR) ఖాతాలో మరో మైలురాయి.. కశ్మీర్ (Kashmir) థియేటర్లలో ప్రదర్శితమవుతున్న తొలి సినిమాగా రికార్డు !

Updated on Sep 21, 2022 05:39 PM IST
జ‌మ్మూక‌శ్మీర్‌లో (Jammu&Kashmir) స్క్రీనింగ్ అయిన తొలి సినిమాగా 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) నిలిచింది.
జ‌మ్మూక‌శ్మీర్‌లో (Jammu&Kashmir) స్క్రీనింగ్ అయిన తొలి సినిమాగా 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) నిలిచింది.

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) 'బాహుబలి' (Bahubali) సిరీస్ సినిమాలతో తెలుగు సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్‌ను తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” (RRR). 

'ఆర్ఆర్ఆర్' సినిమాలో అల్లూరి సీతారామరాజుని పోలిన పాత్రలో రామ్ చరణ్ (Ram Charan), తెలంగాణలో గోండుల హక్కులకై పోరాడిన కొమురం భీమ్‌ని పోలిన పాత్రలో ఎన్టీఆర్ (NTR) నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ నటనపరంగా అదరగొట్టారు. ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించుకున్నారు.

ఇక  'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ద్వారా పదుల కొద్ది దేశాల్లో ప్రేక్షకులకు చేరువయ్యింది. స్థానిక భాషల్లో కొన్ని చోట్ల.. సబ్ టైటిల్స్‌తో కొన్ని చోట్ల ఈ సినిమాను ప్రేక్షకులు ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒక‌టి ప్రస్తుతం నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. జ‌మ్మూక‌శ్మీర్‌లో (Jammu&Kashmir) స్క్రీనింగ్ అయిన తొలి సినిమాగా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది. మూడు ద‌శాబ్దాల త‌ర్వాత క‌శ్మీర్‌‌లో విడుదలైన తొలి సినిమా తెలుగుదే కావ‌డం చాలా ప్ర‌త్యేకం. ఇక, ఈ అరుదైన ఘ‌న‌త‌ను 'ఆర్ఆర్ఆర్' దక్కించుకోవ‌డం చారిత్ర‌క సంద‌ర్బ‌మ‌నే చెప్పాలి.

'ఆర్ఆర్ఆర్' మూవీ పోస్టర్

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా, కశ్మీర్‌లో (Kashmir) మాత్రం సినిమా థియేటర్లకు మొన్నటివరకు స్వాతంత్య్రం రాలేదు. అయితే 32 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లోని సినిమా హాల్స్ ఈ ఆదివారం తెరుచుకున్నాయి. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా.. ‘ఫుల్వామా’, ‘షోపియాన్’ జిల్లాల్లో మల్టీఫ్లెక్స్ సినిమా హాళ్లను ప్రారంభించి.. పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ అయిన “RRR”ను ఆ థియేటర్‌లో వీక్షించారు. ఇది ఓ చారిత్రాత్మక ఘట్టమని అయన అభివర్ణించారు.

మ‌రోవైపు తొలి రోజు స్క్రీనింగ్ అయిన తొలి హిందీ సినిమాగా 'భాగ్ మిల్కా భాగ్' (Bhaag Milkha Bhaag) నిలిచింది. క‌శ్మీర్‌లో మొద‌టి థియేట‌ర్‌ను 1932లో లాల్ చౌక్ వ‌ద్ద భాయ్ అనంత్ సింగ్ గౌరీ ఏర్పాటు చేశారు. మొద‌ట దీనికి క‌శ్మీర్ టాకీస్ పేరు పెట్ట‌గా.. ఆ త‌ర్వాత ఈ పేరును ప‌ల్లాడియంగా మార్చారు. 

ఇక వచ్చేవారం నుంచి కశ్మీర్‌లో తొలి ఐమాక్స్ మల్టీఫ్లెక్స్ (Imax Multiplex in Kashmir) ప్రారంభం కానుంది. శ్రీనగర్‌లోని సోమ్‌వార్ ప్రాంతంలో దీన్ని ప్రారభించనుండగా, ఇందులో 520 సీట్ల సామర్థ్యం కలిగిన మూడు స్క్రీన్లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. 

Read More: జపాన్ లోనూ 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాకు తగ్గని జోరు.. వైరల్ అవుతున్న స్టన్నింగ్ డిజైన్ పోస్టర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!