'శ్రీ వల్లి' (Sri Valli) పాటతో ఆకట్టుకుంటున్న హాట్ బ్యూటీ కేతిక శర్మ (Ketika Sharma).. దేవిశ్రీ ప్రసాద్ ఫిదా!

Updated on Sep 04, 2022 12:58 PM IST
‘పుష్ప’ (Pushpa) సినిమాలోని ‘శ్రీ వల్లి’ (Sri Valli) సాంగ్‌ని కేతిక శర్మ (Ketika Sharma) తెలుగులో పాడి ఆశ్చర్యపరిచింది.
‘పుష్ప’ (Pushpa) సినిమాలోని ‘శ్రీ వల్లి’ (Sri Valli) సాంగ్‌ని కేతిక శర్మ (Ketika Sharma) తెలుగులో పాడి ఆశ్చర్యపరిచింది.

ఆకాష్ పూరి హీరోగా నటించిన 'రొమాంటిక్' సినిమాతో వెండితెరకు హీరోయిన్‏గా పరిచయమైంది కేతిక శర్మ (Kethika Sharma). ఆ సినిమా తర్వాత ఈ బ్యూటీ నటించిన సినిమాలు ‘లక్ష్య’, తాజాగా ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga). అయితే, ఈ మూడు సినిమాలలోనూ ఈ అమ్మడి గ్లామర్‌కి మంచి మార్కులే పడ్డాయి. కానీ. నటన విషయంలో మాత్రం ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. 

ఇక, ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) మూవీ సెప్టెంబర్ 2న విడుదల కాగా.. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కేతిక శర్మ ఓ పాట పాడింది. 

‘పుష్ప’ (Pushpa) సినిమాలోని ‘శ్రీ వల్లి’ (Sri Valli) సాంగ్‌ని తెలుగులో పాడి ఆశ్చర్యపరిచింది. తెలుగు హీరోయిన్లు కూడా పాడలేనంత స్పష్టంగా.. తెలుగులో ఆమె పాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కాగా ఈ వీడియో కాస్త 'పుష్ప' మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi sri Prasad) కంట పడింది. కేతిక పాటను పాడిన విధానానికి ఆయన ఫిదా అయ్యారు. ఆ వీడియోని చూసిన దేవి శ్రీ ప్రసాద్ ఎంతో ఎక్స్‌ప్రెస్సివ్‌గా పాడిందంటూ కేతిక పై ప్రశంసలు కురిపించారు. అయితే మామూలుగానే సెలెబ్రిటీలతో పాటలు పాడిస్తుంటాడు డీఎస్పీ. మరి భవిష్యత్తులో కేతికతోనూ దేవీ శ్రీ ప్రసాద్ ఓ పాటను పాడిస్తాడేమో చూడాలి.

ఇదిలా ఉంటే.. దేవీ శ్రీ ప్రసాద్ (Devi sri Prasad) ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ అయ్యాయని.. మూడు పాటలు కూడా కంపోజ్ చేశానని తెలిపారు. సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ అదిరిపోయిందంటూ దేవీ శ్రీ చెప్పడంతో 'పుష్ప ది రూల్' (Pushpa The Rule) పై అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూట్ ప్రారంభం కానుంది. 

Read More: 'ఇద్దరు మామలను చూస్తూ పెరిగా..' పవన్ కల్యాణ్ 'బద్రి' (Badri) రీమేక్ చేయాలని ఉంది: వైష్ణవ్ తేజ్ (Vaisshnav Tej)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!