హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తేజ్‌ (Ram Charan)..!

Updated on Sep 30, 2022 04:19 PM IST
హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) సంస్థ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్‌ నటుడు రామ్ చరణ్‌ తేజ్‌ (Ram Charan) ను నియమించుకుంది.
హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) సంస్థ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్‌ నటుడు రామ్ చరణ్‌ తేజ్‌ (Ram Charan) ను నియమించుకుంది.

టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'చిరుత' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తర్వాత.. 'మగధీర' సినిమాతో భారతీయ చలనచిత్ర చరిత్రను తిరగరాశాడు. అనంతరం RRR సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా హీరో మోటోకార్ప్‌ (Hero Motocorp) సంస్థ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్‌ నటుడు రాంచరణ్‌ తేజ్‌ ను నియమించుకుంది. గ్లామర్‌ ఎక్స్‌టెక్‌ అనే మోడల్‌కి ఆయన ప్రచారం చేస్తారు. ఈ సందర్భంగా బైక్‌ స్టైల్‌, సేఫ్టీ, పెర్ఫార్మెన్స్‌కి హీరో రామ్ చరణ్‌ సింబాలిక్‌గా నిలుస్తారని హీరో మోటోకార్ప్‌ పేర్కొంది.

కాగా, 'హీరో మోటోకార్ప్'కి కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో రామ్ చరణ్ (Ram Charan Brand Ambassador) నియమించబడినట్లు కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించిన ఎండార్స్‌మెంట్ ఒప్పందంపై చరణ్ సంతకం కూడా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. 

ఈ సందర్భంగా రామ్ చరణ్‌ (Ram Charan) మాట్లాడుతూ.. హీరో కంపెనీతో కలిసి పనిచేయనుండటం, గ్లామర్‌ ఎక్స్‌టెక్‌ గురించి తన ద్వారా మరింత మందికి తెలియనుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇక, రామ్ చరణ్ హీరో గ్లామర్ బైక్ రైడ్ చేస్తున్న వీడియో కూడా ఒకటి విడుదలైంది. ఇందులో ఆయన నెక్సస్ బ్లూ కలర్‌ గ్లామర్ XTEC బైక్ రైడ్ చేయడం చూడవచ్చు. రైడింగ్ చేస్తున్న సమయంలో ఈ బైక్ లోని ఫీచర్స్ గురించి చూపించడం కూడా ఇక్కడ గమనించవచ్చు. కాగా, ఆయన అభిమానులకు కూడా ఇది గుడ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు.

Read More: వెకేషన్ తర్వాత ఎయిర్ పోర్టులో భార్య ఉపాసనతో (Upasana) దర్శనమిచ్చిన రామ్ చరణ్ (Ram Charan).. ఫొటోలు వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!