Salman Khan: ఒకే ఫ్రేములో చిరంజీవి, వెంకటేష్, సల్మాన్ ఖాన్.. ఫోటో చూసేందుకు రెండు కళ్లు చాలలేదుగా !

Updated on Jun 24, 2022 05:24 PM IST
తాజాగా ఒక ప్రైవేట్ పార్టీలో వీరు ముగ్గురు కలుసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో చిరంజీవి (Megastar Chiranjeevi), వెంకటేష్ లతో సల్మాన్ ఖాన్ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి
తాజాగా ఒక ప్రైవేట్ పార్టీలో వీరు ముగ్గురు కలుసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో చిరంజీవి (Megastar Chiranjeevi), వెంకటేష్ లతో సల్మాన్ ఖాన్ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి

Salman Khan: టాలీవుడ్ సెలబ్రిటీలలోని కొందరు హీరోలు ఇతర ఇండస్ట్రీలలోని ప్రముఖులతో మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తుంటారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఆత్మీయంగా వారిని కలుస్తూ ఒకరిపై ఒకరికున్న అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.

ఇందులో భాగంగానే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామందితో ఫ్రెండ్ షిప్ ఉందన్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్  ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర హీరోలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్లతో సరదా సమయాన్ని గడుపుతున్నారు. 

తాజాగా ఒక ప్రైవేట్ పార్టీలో వీరు ముగ్గురు కలుసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో చిరంజీవి (Megastar Chiranjeevi), వెంకటేష్‌లతో సల్మాన్ ఖాన్ దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక, ఈ ఫొటోలో జేసి దివాకర్ రెడ్డి తనయుడు..  జెసి పవన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఇంట్లోనే ఈ ప్రైవేట్ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. ఇలా ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే దగ్గర కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 

 

ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ఫర్హాద్ సాంజి దర్శకత్వంలో  తెరకెక్కుతున్న 'కభీ ఈద్ కభీ దివాళి' (Kabi Eid Kabhi Diwali Movie) సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్న సల్మాన్ ఖాన్... సమయం దొరికినప్పుడల్లా తన క్లోజ్ ఫ్రెండ్స్‌ని కలుస్తూ వారితో తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. అందులో భాగంగానే తాజాగా తన మిత్రులు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌లను కలిసి పార్టీ చేసుకున్నారు. 

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూపోతున్నారు. సల్మాన్ బాలీవుడ్ బడా హీరోల్లో ఒకరు. ఈయన పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ కండల వీరుడు 'కబీ ఈద్ కబీ దివాలీ' సినిమాతో పాటు టైగర్ 3 సినిమాలు చేస్తున్నాడు.

సల్మాన్ నటిస్తున్న 'కబీ ఈద్ కబీ దివాలీ' అనే సినిమాలో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయి‌న్‌గా నటిస్తోంది. అలాగే ఆమె అన్న పాత్రలో వెంకటేష్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. దీంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే సల్మాన్ ఖాన్ తొలిసారిగా చిరుతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో ప్రస్తుతం మెగాస్టార్ నటిస్తున్న 'గాడ్ ఫాదర్' (God Father Movie) సినిమాలో సల్లూ భాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ స్టార్‌కు తెలుగు డెబ్యూ మూవీ కావడం విశేషం. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది.

మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ చిత్రంలో గెస్ట్ రోల్‌లో కనిపిస్తారని.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. చిరు - వెంకీలతో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కానున్నాడు సల్మాన్. రియర్ లైఫ్‌లో ఫ్రెండ్స్ గా ఉన్న వీరు ముగ్గురూ.. బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి. 

ఇటీవల 'విక్రమ్' సినిమా సక్సెస్ అయినందున చిరంజీవి తన నివాసంలో (Kamal Hassan) కమల్ హాసన్ - డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో సహా పలువురు సినీ ప్రముఖులకు విందు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సల్మాన్ కూడా హాజరయ్యారు.

ఇప్పుడు మరోసారి టాలీవుడ్ స్టార్స్‌‌తో కలిసి పార్టీలో పాల్గొన్నారు. ఇక, ఇదిలా ఉంటే.. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్.. ఆ ఫోటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Read More: విక్ర‌మ్ టీమ్‌కు పార్టీ ఇచ్చిన చిరంజీవి (Chiranjeevi) ! మ‌రి స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) ఎందుకెళ్లారు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!