Salman Khan : సల్మాన్ ఖాన్‌తో కలిసి రామ్ చరణ్ నటించేస్తున్నాడు ! ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తే ఆ మజాయే వేరు !

Updated on Jun 20, 2022 05:07 PM IST
సల్మాన్ చిత్రానికి 'భాయ్ జాన్' అనే పేరు పెట్టారని, ఇటీవలే రామ్ చరణ్ (Ram Charan) కూడా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌కు వచ్చారనేది తాజా సమాచారం.
సల్మాన్ చిత్రానికి 'భాయ్ జాన్' అనే పేరు పెట్టారని, ఇటీవలే రామ్ చరణ్ (Ram Charan) కూడా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌కు వచ్చారనేది తాజా సమాచారం.

Salman Khan : సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ నగరంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో వెంకటేష్, పూజా హెగ్డేతో పాటు జస్సీ గిల్, షెహనాజ్ గిల్, పాలక్ తివారి, రఘు జుయల్, సిద్ధార్థ్ నిగమ్ మొదలైనవారు నటిస్తున్నారు. 

ఇప్పుడు ఇదే సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. సల్మాన్ చిత్రానికి 'భాయ్ జాన్' అనే పేరు పెట్టారని, ఇటీవలే రామ్ చరణ్ (Ram Charan) కూడా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌కు వచ్చారనేది తాజా సమాచారం. 

స్పెషల్ సాంగ్‌లో రామ్ చరణ్

అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రంలో రామ్ చరణ్ (Ram Charan), సల్మాన్‌తో కలిసి ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారట. ఇందులో వెంకటేష్ కూడా కనిపిస్తారని టాక్. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, త్వరలోనే తదుపరి షెడ్యూల్‌ను ముంబయికి మళ్లించనుందని సమాచారం. 

చిరంజీవి సినిమాలో సల్మాన్

రామ్ చరణ్ ప్రస్తుతం RC 15 చిత్రానికి సంబంధించిన పనులలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సల్మాన్ ఖాన్ (Salman Khan) విషయానికి వస్తే, ఈయన చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నారు.

అదే విధంగా, 'కభీ ఈద్ కభీ దివాలి' చిత్రానికి ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో పఠాన్, టైగర్ 3 అనే చిత్రాలకు కూడా సల్మాన్ ఖాన్ సైన్ చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు 2023 లో విడుదల అవుతాయి. 

Read More: మా పెళ్లి బంధానికి ప‌దేళ్లు : ఉపాసన (Upasana) ఎమోష‌న‌ల్ ట్వీట్!

 

 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!