విక్ర‌మ్ టీమ్‌కు పార్టీ ఇచ్చిన చిరంజీవి (Chiranjeevi) ! మ‌రి స‌ల్మాన్ ఖాన్ (Salman Khan) ఎందుకెళ్లారు?

Updated on Jun 16, 2022 03:55 PM IST
హైద‌రాబాద్ వ‌చ్చిన క‌మ‌ల్ హాస‌న్ అండ్ టీమ్‌ను చిరంజీవి (Chiranjeevi) త‌న ఇంటికి ఆహ్మానించారు. వీరితో పాటు స‌ల్మాన్ ఖాన్ కూడా వెళ్లారు. 
హైద‌రాబాద్ వ‌చ్చిన క‌మ‌ల్ హాస‌న్ అండ్ టీమ్‌ను చిరంజీవి (Chiranjeevi) త‌న ఇంటికి ఆహ్మానించారు. వీరితో పాటు స‌ల్మాన్ ఖాన్ కూడా వెళ్లారు. 

'విక్రమ్'.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే సినిమా గురించిన చర్చ. కమల్ హాసన్ తన నటనా విశ్వరూపాన్ని మరోసారి ఈ సినిమాతో చూపించారు. భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా మార్చడానికి నడుం బిగించే ఓ మాజీ 'రా' ఏజెంట్ కథ ఈ 'విక్రమ్'. ఈ చిత్రంలో కమల్ హాసన్ తన పాత్రలో ఒదిగిపోయారు.

అలాగే నెగటివ్ రోల్‌లో విజయ్ సేతుపతి కూడా తనదైన శైలిలో నటించారు. ఇక సూర్య స్పెషల్ ఎంట్రెన్స్ ఎపిసోడ్ అయితే .. విక్రమ్ 2 సినిమా కూడా ఉండబోతుందని ఓ క్లూ ఇచ్చింది. చిత్రమేంటంటే.. ఈ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. 

ఈ క్రమంలో విక్ర‌మ్ టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) త‌న ఇంటికి ఆహ్వానించారు. అంతేకాదు వీరికి పార్టీ కూడా ఇచ్చారు చిరు. హీరో క‌మ‌ల్ హాస‌న్, ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్ ల‌తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ కూడా చిరంజీవి ఇంటికి వెళ్ల‌డం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. విక్ర‌మ్ 2 సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కీ రోల్ ప్లే చేస్తున్నారా?. లేక‌ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్నారా? అన్న విషయం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చిందట. 

మేటి డైరెక్టర్ లోకేష్ క‌న‌గ‌రాజ్‌

హైద‌రాబాద్‌లో  నిన్నే 'విక్ర‌మ్' స‌క్సెస్ మీట్ జ‌రిగింది. 'విక్ర‌మ్' సినిమాను ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌మ‌ల్ హాస‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. విక్ర‌మ్ ద‌ర్శ‌కుడు లోకేష్ కూడా తెలుగు ఆడియ‌న్స్‌కు స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్పారు. 'విక్ర‌మ్' బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించ‌డంతో క‌మ‌ల్ హాస‌న్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

హైద‌రాబాద్ వ‌చ్చిన క‌మ‌ల్ హాస‌న్ అండ్ టీమ్‌ను చిరంజీవి (Chiranjeevi) త‌న ఇంటికి ఆహ్మానించారు. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. నేటికాలపు మేటి డైరెక్టర్‌గా ఆయనకు కితాబునిచ్చారు. చిరంజీవి ప్రత్యేక ఆహ్వానం మేరకు, కమల్‌తో పాటు స‌ల్మాన్ ఖాన్ కూడా ఆయన ఇంటికి వెళ్లారు. 

విక్ర‌మ్ స‌క్సెస్ సెల‌బ్రేషన్స్ .. చిరు ట్వీట్
త‌న ప్రియ‌మైన స్నేహితుడు క‌మ‌ల్ హాస‌న్‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తున్నానంటూ చిరంజీవి ట్వీట్ చేశారు . ' విక్రమ్' స‌క్సెస్ సెల‌బ్రేషన్ పార్టీని ఆస్వాదిస్తున్నామని చిరు తెలిపారు. బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి ఈ పార్టీ చేసుకోవడం మరింత ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.విక్ర‌మ్ థ్రిల్లింగ్ సినిమా అని.. ఈ స‌క్సెస్‌తో వారికి మ‌రింత ప‌వ‌ర్ వస్తుందని అభిప్రాయపడ్డారు చిరంజీవి. 

స‌ల్మాన్ ఎందుకెళ్లారో!
'విక్ర‌మ్' టీమ్‌తో పాటు స‌ల్మాన్ ఖాన్ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లారు. స‌ల్మాన్ ఖాన్ ఇటీవ‌లే 'క‌భీ ఈద్ క‌భీ దీవాళి' సినిమా షూటింగ్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు. హైద‌రాబాద్‌లో వెంక‌టేష్‌, స‌ల్మాన్ ఖాన్‌ కాంబినేషన్‌లో షూటింగ్ షెడ్యూల్ జ‌రుగుతోంది. త‌న సినిమా షూటింగ్‌కు వ‌చ్చిన స‌ల్మాన్, చిరంజీవి ఇంటికి వెళ్ల‌డంపై ఇప్పుడు సర్వత్రా ఆస‌క్తి నెల‌కొంది.

మెగా ఫ్యామిలీ హీరోతో స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్నార‌నే వార్త‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్' సినిమాలో.. స‌ల్లూ భాయ్ ఉన్నాడ‌నే వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

అయితే స‌ల్మాన్ ఖాన్ త‌న సినిమాలో న‌టించ‌డం లేదని.. ప‌వ‌న్‌తో క‌లిసి స‌ల్మాన్ న‌టించ‌డం ఫేక్ న్యూస్ అని హ‌రీష్ శంక‌ర్ తెలిపారు. ఇక చిరంజీవి (Chiranjeevi) సినిమాలో స‌ల్మాన్ ఖాన్ నటిస్తారా అన్నదాంట్లో కూడా ఎంత నిజముందో.. కాలమే నిర్ణయించాలి. 

Read More:  Vikram 2 : 'విక్రమ్ 2' సినిమాలో క‌మ‌ల్ హాస‌న్‌, రామ్ చ‌ర‌ణ్ ? ఈ కాంబో కేక అంటున్న ఫ్యాన్స్ !

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!