స‌మంత (Samantha) నటించిన 'శాకుంత‌లం' (Shakuntalam) త్రీడీ థియేటర్లలో విడుదల.. అధికారిక ప్రకటన!

Updated on Nov 04, 2022 05:51 PM IST
మోషన్ పోస్టర్ (Shakuntalam Motion Poster) టీజర్ ని విడుదల చేస్తూ ఈ చిత్రాన్ని కూడా 3డి టెక్నాలజీలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్.
మోషన్ పోస్టర్ (Shakuntalam Motion Poster) టీజర్ ని విడుదల చేస్తూ ఈ చిత్రాన్ని కూడా 3డి టెక్నాలజీలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత (Samantha) న‌టిస్తున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'శాకుంత‌లం' (Shakuntalam). 'రుద్ర‌మ‌దేవి' సినిమాతో మ‌రింత పాపుల‌ర్ అయిన ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో స‌మంత 'శ‌కుంత‌ల' పాత్ర‌లో.. మలయాళ నటుడు దేవ్ మోహన్  దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు, ఈ ప్రేమ కథను ఆసక్తికరంగా గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో రూపొందించారు. 

అయితే, గ‌త కొన్ని రోజులుగా 'శాకుంతలం' (Shakuntalam) సినిమా రిలీజ్‌పై ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. డిసెంబ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్ చేస్తార‌నే టాక్ వినిపించింది. ఈ నేప‌థ్యంలో ఇటీవల ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ త‌న సినిమా 'శాకుంత‌లం' రిలీజ్ ఎప్పుడో ప్ర‌క‌టించారు. ఓ వీడియోను రిలీజ్ చేసి మ‌రీ 'శాకుంత‌లం' సినిమా అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు. ఈ వీడియోలో స‌మంత మ‌రింత అందంగా క‌నిపించారు. దేవ్ మోహ‌న్‌, స‌మంత ఫోటోను కూడా విడుద‌ల చేశారు. అందులో 'శాకుంత‌లం' (Shakuntalam Release Date) సినిమాను న‌వంబ‌ర్ 4 తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

మహాభారతంలోని ఆదిపర్వం ఆధారంగా 'శాకుంత‌లం' (Shakuntalam) సినిమాను గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. శకుంతల, దుష్యంతుల ప్రేమకథను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు గుణ‌శేఖ‌ర్. ప్రస్తుతం 'శాకుంత‌లం' సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయట‌. ఈ సినిమాలో భ‌ర‌తుడి పాత్ర‌లో అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ న‌టిస్తున్నారు. దుర్వాస మునిగా మోహ‌న్ బాబు న‌టిస్తున్నారు. అనసూయ పాత్రలో అదితి బాలన్ నటిస్తున్నారు. రాక్షసుడి పాత్రలో కబీర్ దుల్హన్ సింగ్.. ఇక‌ మేనక పాత్రలో మధు నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని గుణ‌శేఖ‌ర్ (Director Gunasekhar) కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. గుణ‌టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మ‌ర్ఫ‌ణ‌లో 'శాకుంత‌లం' చిత్రం విడుద‌ల కానుంది. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొనగా మేకర్స్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. ఓ ఇంట్రెస్టింగ్ మోషన్ పోస్టర్ (Shakuntalam Motion Poster) టీజర్ ని విడుదల చేస్తూ ఈ చిత్రాన్ని కూడా 3డి టెక్నాలజీలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక, కొత్త రిలీజ్ డేట్ ని అతి త్వరలోనే అనౌన్స్ చేస్తున్నట్టు ఆ వీడియోలో కన్ఫర్మ్ చేశారు. ఇక, భారీ సెట్టింగ్స్ తో పాటుగా సంగీత దర్శకుడు మణిశర్మ ఇచ్చిన నేపథ్య గీతం ఈ చిత్రానికి మరింత గ్రాండియర్ తెచ్చి పెట్టేలా అనిపిస్తోంది.

Read More: సమంత (Samantha) 'శాకుంతలం' (Shakuntalam) నుంచి బిగ్ అప్ డేట్.. గ్రాఫికల్ వర్క్ లో బిజీగా మూవీ యూనిట్..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!