'యశోద'లో హాలీవుడ్ స్టంట్ మాస్టర్ శిక్షణలో యాక్షన్ సీన్స్ తో అదరగొట్టిన సమంత(Samantha).. మేకింగ్ వీడియో రిలీజ్!

Updated on Nov 01, 2022 05:51 PM IST
'యశోద' (Yashoda) సినిమా కోసం సమంత (Samantha) కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేశారట.
'యశోద' (Yashoda) సినిమా కోసం సమంత (Samantha) కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేశారట.

టాలీవుడ్ బ్యూటీ సమంత (Actress Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’ (Yashoda). సరోగసి నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమాకు హరి-హరీష్‌ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ ఈ మూవీని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాలో 'యశోద'గా సమంత నటనకు అందరూ ఫిదా అయిపోవడం గ్యారంటీ అని ట్రైలర్ చెబుతోంది.

ఇదిలా ఉంటే.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ.. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్, కన్నడ, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాది ఆగ‌స్టు 12న విడుద‌ల చేయాల‌ని ఇంతకుముందు చిత్ర యూనిట్‌ వెల్లడించారు. అయితే ఇప్పుడు చిత్రం విడుదల వాయిదా పడింది. నవంబర్ 12న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

కాగా, 'యశోద' (Yashoda) సినిమా కోసం సమంత (Samantha) కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేశారట. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా యానిక్ బెన్ పర్యవేక్షణలో సమంత చేసిన యాక్షన్ సన్నివేశాల మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో సమంత ఈ యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టింది.

'యశోద' (Yashoda) చిత్రంలోని సామ్‌ యాక్షన్‌ సన్నివేశాలు  ప్రేక్షకులకు గూస్ బంప్స్  తెప్పించడం ఖాయయని విజువల్స్ చూస్తే తెలిసిపోతుంది.  సరోగసీ అంశం ప్రధానంగా మెడికల్ మాఫియా నేపథ్యంలో యశోద తెరకెక్కింది. యశోద ట్రైలర్ లో (Yashoda Trailer) యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేకంగా నిలిచాయి. అయితే యాక్షన్ సీన్స్ అంత గ్రాండ్ గా రావడానికి కారణం... హాలీవుడ్ టెక్నీషియన్ పని చేయడమే కారణం.

Read More: Yashoda Trailer: 'యశోద ఎవరో తెలుసు కదా! ఆ కృష్ణ పరమాత్ముడిని పెంచిన తల్లి'.. గర్భవతిగా సమంత (Samantha)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!